పేటీయం నుంచి మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త
21-11-201921-11-2019 13:38:58 IST
2019-11-21T08:08:58.062Z21-11-2019 2019-11-21T08:08:56.715Z - - 11-04-2021

ఈమధ్య కాలంలో డిజిటల్ లావాదేవీలు బాగా జరుగుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత అయితే జనం పేటిఎం వంటి వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే మోసగాళ్ళు వేటినీ వదలడం లేదు. వివిధ రకాల ఎస్ ఎంఎస్ లు పంపి వినియోగదారుల నుంచి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. పేటీఎం వినియోగదారులు నకిలీ ఎస్ఎంఎస్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
పేటీఎంలో గత కొద్ది రోజులుగా కస్టమర్లకు నకిలీ ఎస్ఎంఎస్లు ఎక్కువగా వస్తున్నాయి. మీ కేవైసీ అప్ డేట్ చేసుకోండి, మీ ఆధార్ వివరాలు, బ్యాంకు వివరాలు ఇవ్వండి.. లేకుంటే మీ అకౌంట్ రద్దవుతుందనే హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అనేక మంది వినియోగదారులు పేటీఎంకు ఫిర్యాదుచేశారు. దీనిపై సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్లో స్పందించారు. యూజర్లను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పేటీఎం వినియోగదారులకు వారి పేటీఎం అకౌంట్లు హోల్డ్‌లో ఉన్నాయని, కేవైసీ చేసుకోవాలని వచ్చే మెసేజ్‌లు నమ్మవద్దని, ఇవి అధికారికంగా పేటీఎం పంపించే మెసేజ్ లు కావని పేర్కొన్నారు సీఈవో. కొంతమంది సైబర్ నేరగాళ్ళు పేటీఎం యూజర్ల డేటాను చోరీ చేసేందుకు వేసిన ఎత్తుగడ ఇది అని వివరించారు. వినియోగదారులు నకిలీ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటికి స్పందించవద్దన్నారు.


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా