పేటిఎం యాప్‌లో హైదరాబాద్ మెట్రో సేవలు
28-06-201928-06-2019 15:32:21 IST
2019-06-28T10:02:21.147Z28-06-2019 2019-06-28T10:02:19.183Z - - 17-04-2021

హైదరాబాద్ మెట్రో నగర జీవుల ప్రయాణ గతిని మార్చేసిందని చెప్పవచ్చు. ఎన్నో ఆశలతో మెట్రో కోసం ఎదురుచూసిన నగరవాసులు మెట్రో సేవలపై మిశ్రమ స్పందన కనబరుస్తున్నారు. తాజాగా పేటీఎం యాప్ ద్వారా హైదరాబాద్ లోని మెట్రో వివరాలను తెలుసుకునే వెసులు బాటు అందుబాటగులోకి వచ్చింది. ఇప్పటికే మెట్రో రైలు సదుపాయం ఉన్న ఢిల్లీ, నోయిడా, గురుగావ్, బెంగళూరు, కలకత్తా, ముంబై, చెన్నై, లక్నో, కొచ్చి, జైపూర్‌లో అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇక నుంచి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రయాణికులు తాము ప్రయాణించే రూట్లకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను సూచించడమే కాకుండా, ప్రయాణ సమయం అంచనా, చార్జీలు, మధ్యలో వచ్చు స్టేషన్ల సంఖ్య, లైన్ల మార్పిడి కోసం ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ల వివరాలను యాప్ ద్వారా పొందవచ్చు. దీనివల్ల విలువైన సమయం, ఖచ్చితమయిన సమాచారం అందించవచ్చు. మెట్రో రూట్ సెర్చ్ అనేదీ మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తెలివిగా ప్లాన్ చేసుకునేందుకు ఒక సౌకర్యవంతమైన పద్ధతిగా చెబుతున్నారు. పేటీఎం యాప్‌లో మెట్రో ఐకాన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై కనబడే దానిలో హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుని రూట్ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు. మీరు ఉన్న స్థానం.. మీరెక్కడికి వెళ్లాలి, ఎంత సమయం పడుతుందనేది తెలుసుకోవచ్చు. రూట్స్ చూడటానికి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి. యాప్‌లో రూట్‌తో పాటు ఎంపిక చేసుకున్న స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చూపిస్తుంది. దీంతో ఏ సమయానికి మీరు బయలుదేరాలి, ఎంత టైంకి అక్కడికి చేరుకుంటారో తెలియచేస్తుంది. ఈ యాప్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా