newssting
BITING NEWS :
* టీడీపీలో సంక్షోభం.. నలుగురు రాజ్యసభ ఎంపీల తిరుగుబాటు.. తమను బీజేపీలో విలీనం చేయాలని లేఖ *టీడీపీ రాజ్యసభ ఎంపీలకు స్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా * పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ *కాకినాడలో కాపు నేతల రహస్య సమావేశం *టీటీడీ చైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ రాజీనామా*లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా *కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

పుస్తక ప్రియులకు ఎయిర్ టెల్ గుడ్ న్యూస్

15-04-201915-04-2019 12:43:24 IST
2019-04-15T07:13:24.597Z15-04-2019 2019-04-15T07:13:23.013Z - - 21-06-2019

పుస్తక ప్రియులకు ఎయిర్ టెల్ గుడ్ న్యూస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీరు పుస్తక ప్రియులా.. మీరు గంటల తరబడి పుస్తకాలు చదివే అలవాటు వుందా? అయితే మీ పఠన దాహం తీరేందుకు ఎయిర్ టెల్ ఓ చక్కని వేదిక కాబోతోంది. భార‌తీ ఎయిర్‌టెల్ దేశంలోని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల కోసం కొత్తగా ఇ-బుక్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 70వేల‌కు పైగా పుస్తకాల‌ను హాయిగా చదువుకోవచ్చు. ఎయిర్‌టెల్‌, నాన్ ఎయిర్‌టెల్ క‌స్టమ‌ర్లకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ ల‌భిస్తోంది. ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్‌ను ఎలాంటి రుసుము లేకుండా 30 రోజుల పాటు ట్రయ‌ల్ పీరియ‌డ్‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు. 

మీకు అది నచ్చితే నెల‌వారీ రుసుం చెల్లించే అవకాశం కల్పించింది. 6 నెల‌ల‌కు రూ.129 లేదా 12 నెల‌ల‌కు రూ.199 చెల్లిస్తే ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్‌లో ఉన్న పుస్తకాల‌ను చ‌దువుకోవ‌చ్చు. అంటే ఏడాదికి రెండువందలతో మీకు కావాల్సిన పుస్తకాలు ఇంట్లో ఉండి హాయిగా చదువుకోవచ్చు. అంతేకాదు ఎయిర్‌టెల్ క‌స్టమ‌ర్లకు అయితే 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా ల‌భిస్తాయి. అంతేకాదు ఆయా బుక్స్ మీకు నచ్చితే షాపింగ్ కూడా చేయవచ్చు. ఎయిర్ టెల్ ఈబుక్స్ భలేగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం యాప్ డౌన్ లోడ్ చేసుకుని బుక్స్ చదువుకుంటూ హాయిగా మీరు టైంపాస్ చేసుకోండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle