పాప్ అప్‌లో రెండు కెమెరాలు... మొబైల్లో మస్తు ఫీచర్లు
21-09-201921-09-2019 10:42:39 IST
2019-09-21T05:12:39.093Z21-09-2019 2019-09-21T05:12:36.666Z - - 20-04-2021

ఇప్పుడు అంతా పాప్ అప్ సెల్ఫీ కెమెరా ట్రెండ్ రన్ అవుతోంది. చైనా మొబైల్ కంపెనీలు ఒప్పొ, వీవో, షావోమీ, రియల్‌మి ఇలాంటి ఫోన్లు తీసుకురావడానికే మక్కువ చూపిస్తున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందాన ఫ్రంట్ సైట్ ఫుల్ స్క్రీన్ ఇవ్వొచ్చు, పాప్ అప్ సెటప్‌లో మంచి నాణ్యత ఉన్న కెమెరాలు పెట్టొచ్చు. అందుకే చాలా సంస్థలు పాప్ అప్ సెటప్‌లో కెమెరాను తీసుకొస్తున్నాయి. అయితే దీనికి ఒక వంతు ఎక్కువేసి వీవో ఫ్రంట్ సైడ్ రెండు కెమెరాలతో ఒక ఫోన్‌ను తీసుకొచ్చిది. వీవో వి15 ప్రోకు సక్సెసర్‌గా వీవో వి17 ప్రోను లాంచ్ చేసింది. మొన్నామధ్య బిగ్‌బాస్ -13 హిందీ ప్రోమోలో ఈ మొబైల్ కనిపించినప్పటి నుంచి దీనిపై ఆసక్తి పెరిగింది.
వీవో వి17 ప్రో పేరిట లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను సెల్ఫీ సెంట్రిక్ మొబైల్గా లాంచ్ చేశారు. అందుకు తగ్గట్టుగా ఇందులో మొత్తం ఆరు కెమెరాలున్నాయి. ముందువైపు 32ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. దీంతో నాణ్యమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. దీంతో 105 డిగ్రీల వైడ్ యాంగిల్లో ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే వెనుక వైపు నాలుగు కెమెరాలున్నాయి. అందులో మొదటిది 48 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 582 సెన్సర్. దీనిని వీవో సూపర్ క్లారిటీ కెమెరా అని పిలుస్తోంది. ఇది కాకుండా 13 ఎంపీ టెలీఫొటోలెన్స్ ఉంటుంది. దీంతో 2 Xవరకు జూమ్ చేసి ఫొటోలు తీయొచ్చు. 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. పోర్ట్రెయిట్ ఫొటోస్ కోసం 2 ఎంపీ డెప్త్ సెన్సర్‌ను ఇస్తున్నారు.
ఆండ్రాయిడ్ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ పని చేస్తుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉంటుంది. 6.44 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులోనే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఆప్షన్ ఉంటుంది. ఫోన్ వెనక భాగాన్ని గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్షన్ చేయించారు. ఈ మొబైల్లో 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ 18W ఫాస్ట్ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు సెల్ఫీ కెమెరాలో నైట్ మోడ్, మూన్ లైట్ మోడ్ ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ ప్రారంభ ధరను ₹ 29,990.
మిడ్ నైట్ ఓషన్, గ్లాసియర్ ఐస్ రంగుల్లో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 27 నుంచి వివో ఈ-షాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్ వెబ్సైట్లలో మొబైల్ అమ్మకాలు జరుగుతాయి. లాంచింగ్ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. వీటితోపాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.



వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా