newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

పాక్‌లో మొన్న పబ్ జీ గేమ్ బ్యాన్.. టిక్ టాక్‌కి వార్నింగ్

21-07-202021-07-2020 18:36:14 IST
2020-07-21T13:06:14.640Z21-07-2020 2020-07-21T13:06:06.349Z - - 03-08-2020

పాక్‌లో మొన్న పబ్ జీ గేమ్ బ్యాన్.. టిక్ టాక్‌కి వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇస్లాం మ‌తానికి వ్య‌తిరేకంగా ఉండ‌టంతోపాటు చిన్నారుల‌కు, యువ‌త‌కు హాని క‌లిగిస్తున్న పబ్ జీ గేమ్ ని పాకిస్తాన్ నిషేధించింది. జూలై 1న‌ుంచే ప‌బ్‌జీ గేమ్‌పై నిషేధం కొనసాగుతోంది. .అదే బాటలోప్ర‌ముఖ వీడియె మెసేజింగ్ యాప్‌ టిక్‌టాక్ రానుంది. ఇంచుమించు ఇలాంటి ఆరోప‌ణ‌లే ఎదుర్కొంటున్న టిక్‌టాక్‌కు పాక్ ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. టిక్‌టాక్‌లో అస‌భ్య‌త, అశ్లీల‌త హెచ్చు మీరకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దాని మాతృ సంస్థ బైట్ డాన్స్‌ను ఆదేశించింది."సోష‌ల్ మీడియా యాప్స్‌లో అస‌భ్య కంటెంట్ ఉంటోందంటూ మాకు అనేక ఫిర్యాదులు వ‌చ్చాయి.

వీటిలో అధికంగా టిక్‌టాక్, బిగో నుంచే ఉన్నాయి. ముఖ్యంగా యువ‌త‌ను చెడుదారి ప‌ట్టించే కంటెంట్ ఎక్కువ‌గా ఉంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇప్ప‌టికే దీనిగురించి ఆయా సంస్థ‌ల‌కు నోటీసులు జారీ చేశాం. కానీ వారి స్పంద‌న అంత సంతృప్తికరంగా లేదు. దీంతో ఇప్ప‌టికే బిగోను నిషేధించాం. టిక్‌టాక్‌కు ఆఖ‌రి హెచ్చ‌రిక జారీ చేశామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. 

భారత్ -చైనా సరిహద్దుల వద్ద ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ‌ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌న్న కార‌ణంతో భార‌త్ కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. దీనితోపాటు మ‌రో 58 యాప్‌ల‌ను నిషేధించింది. ఆర్మీ కూడా వివిధ సోషల్ మీడియా యాప్ లను తొలగించాలని సిబ్బందిని ఆదేశించింది. 

పబ్​జీ వల్ల యువకుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, ఎంతో విలువైన సమయమూ వృథా అవుతోందని ఇమ్రాన్​ ఖాన్​ పేర్కొన్నారు. దీన్ని పాకిస్తానీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పబ్​జీ నిషేధాన్ని సవాలు చేస్తూ ఇస్లామాబాద్​ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్​ దాఖలైంది. పాకిస్తాన్ వీడియో గేమ్స్​ను నిషేధించడం ఇది నాలుగోసారి. గతంలో పాకిస్తాన్​లో టెర్రరిస్టులు తలదాచుకున్నారని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్​ఐ వారికి మద్దతునిస్తోందని చూపించినందుకు కాల్​ ఆఫ్ డ్యూటీ, మెడల్​ ఆఫ్ హానర్ గేమ్స్​ను బ్యాన్ చేసింది. 2017లో సెక్సువల్​ కంటెంట్​ ఉన్న వాల్కైరీ డ్రైవ్​: భిక్కూని అనే గేమ్​ను సైతం నిషేధించింది. కాగా, ఇస్లామాబాద్​ హైకోర్టులో టిక్​టాక్​ను నిషేధించాలంటూ పిటిషన్​ కూడా దాఖలైంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle