newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

పబ్ జీ గేమ్ ఆడితే అరెస్ట్... ఎక్కడ? ఎందుకు?

14-03-201914-03-2019 18:16:41 IST
2019-03-14T12:46:41.960Z14-03-2019 2019-03-14T12:46:37.622Z - - 26-05-2019

పబ్ జీ గేమ్ ఆడితే అరెస్ట్... ఎక్కడ? ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గేమ్స్ ఆడితేనే అరెస్ట్ చేస్తారా? ఇదేం అన్యాయం అని అనకండి. ఎందుకంటే వివిధ గేమ్స్ వల్ల గొడవలు, హత్యలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ ఈ గేమ్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. 

పబ్‌జీ గేమ్‌ ఆడినందుకు పది మంది విద్యార్థులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో పది మంది యూనివర్సిటీ విద్యార్థులు గేమ్ ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఈ గేమ్‌ వల్ల పిల్లలు ప్రవర్తన, భాషలో మార్పు రావడంతో పాటు వారి చదువు కూడా నాశనం అవుతోందని గుజరాత్ ప్రభుత్వం ఈ ఆటను నిషేధించిన సంగతి తెలిసిందే. 

అయితే పబ్ జీ గేమ్ ఆడుతూ అరెస్టయిన విద్యార్ధులను వెంటనే విడుదలచేశారు. ఈ గేమ్ ఆడవద్దని కౌన్సిలింగ్ చేశామని పోలీసులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ల మంది ఈ గేమ్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం. పబ్ జీ గేమ్ కారణంగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. చదువుపై వారికి శ్రద్ధ తగ్గుతోందనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీంతో విద్యావేత్తలు పిల్లలు ఆడే గేమ్స్ పై ఒక కన్నేసి ఉంచాలంటున్నారు.  

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle