newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పబ్ జి... ఫేస్ బుక్ సహా 87 యాప్ లపై ఆర్మీ నిషేధం

09-07-202009-07-2020 13:51:53 IST
2020-07-09T08:21:53.508Z09-07-2020 2020-07-09T08:21:48.296Z - - 04-08-2020

పబ్ జి... ఫేస్ బుక్ సహా 87 యాప్ లపై ఆర్మీ నిషేధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశభద్రతతో పాటు పౌరుల, సైనికుల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే  కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ సహా 59  చైనా యాప్ లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధంతో చైనాకు చెందిన ఆయా యాప్ లు ఇండియా ప్లే స్టోర్ నుంచి తొలగించబడ్డాయి. ఇప్పుడు అదే బాటలో ఇండియన్ ఆర్మీ కూడా నడిచింది.  ఫేస్ బుక్ తో సహా మొత్తం 89 యాప్ లపై నిషేధం విధించింది.  

ఆర్మీ నిషేదించిన 89 రకాల యాప్ ల నుంచి అంతా బయటకు రావాలని పేర్కొంది, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు తమ మొబైల్స్ నుంచి వీటిని తొలగించుకోవాలని ఆదేశించింది.  జులై 15 వ తేదీ లోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని తన 13 లక్షల మంది ఆర్మీ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.  ఆర్మీ నిషేధించిన జాబితాలో వుయ్ చాట్, కిక్, క్యూక్యూ, హలో, లైన్, ఐఎంవో, టు టాక్, హైక్, వీడియో హోస్టింగ్ కి సంబంధించి టిక్ టాక్, లైకీ, సమోసా, క్వాలీ, షేర్ ఇట్, క్సెండర్, జాప్యా, యుసీ బ్రౌజర్, యు సి బ్రౌజర్ మినీ, లివ్ మీ, బ్యూటీ ప్లస్, ట్యూకాలర్, పబ్జీ, నోనోలైవ్, క్లాజ్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీ, డీఎక్స్, టీబీడ్రెస్, రోస్ గల్, రోంవీ, డేటింగ్ యాప్స్, టిండర్, హ్యాప్పిన్ వంటివి వున్నాయి. 

https://www.photojoiner.net/image/ptmUqfEU

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle