పబ్జీలో గ్యాస్ క్యాన్లు, కొత్త వాహనాలు వచ్చాయ్..!
11-10-201911-10-2019 09:42:03 IST
2019-10-11T04:12:03.665Z11-10-2019 2019-10-11T04:11:56.737Z - - 22-04-2021

పబ్జీ మొబైల్ గేమ్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఏదో కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఆటో రిక్షాలు, కొత్త గన్లు, మ్యాప్స్, మోడ్స్‌ను ప్రవేశపెట్టారు. ఇన్నవీ యూజర్ల ఆటకు అతుక్కుపోవడానికే అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో పబ్జీ మరో కొత్త వెహికల్ ని ఆటలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా ఆటలో యాడ్ కాబోతున్నాయి.
పబ్జీకి సంబంధించి ఇటీవల ట్విట్టర్ లో కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను సంస్థ వెల్లడించింది. దాని ప్రకారం చూస్తే లెడ్జ్ గ్రాబ్ అనే కొత్త మూమెంట్ ఫీచర్ రాబోతోంది. 0.15.0 అప్డేట్తో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
ఇందులో బీఆర్డీఎం - 2 వాహనాన్నికొత్తగా తీసుకొస్తున్నారు. దీంతోపాటు లెడ్జ్ గ్రాబ్ ఆప్షన్‌ను కూడా వస్తోంది. దీని ద్వారా ఆటగాళ్లు ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కి సులభంగా దూకేయొచ్చు. ఆటలో స్క్రీన్ కంట్రోల్స్ కూడా తీసుకొచ్చే దిశగా టెన్సెంట్ ప్రయత్నాలు చేస్తోంది.
పబ్జీలో గన్స్ జాబితాలోకి మరో కొత్త గన్ వస్తోంది. డిజర్ట్ ఈగల్ గా పిలుస్తున్న ఈ గన్ 0.45 ఏసీపీ బులెట్స్‌తో పని చేస్తుంది. అలాగే సైట్, ఎక్స్టెండెడ్ మ్యాగజీన్, గ్రిప్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి. దీంతోపాటు ఆర్మ్డ్ యూఏజెడ్ వాహనానం బదులు బీఆర్డీఎం - 2 వాహనాన్ని తీసుకొస్తున్నారు. ఇది నీరు, నేల మీద ప్రయాణించేలా ఉంటుంది. అంతేకాదు ఇది బులెట్ ప్రూఫ్ వాహనం. ఇతర ఆటగాళ్లను ట్రాప్చేయడానికి ఎక్స్ప్లోడబుల్ గ్యాస్ క్యాన్లను కూడా ఆటలో పరిచయం చేస్తున్నారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
6 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా