పది వేల అప్లికేషన్లు తొలగించిన ఫేస్బుక్..
24-09-201924-09-2019 09:26:37 IST
2019-09-24T03:56:37.796Z24-09-2019 2019-09-24T03:56:36.031Z - - 12-04-2021

కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూ తర్వాత ఫేస్బుక్ వాడేవాళ్లలో చిన్న భయం మొదలైంది. వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా దారిమళ్లిస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ కూడా జరిగింది. సుదీర్ఘ విచారణల తర్వాత విషయం నిజమే అని తేలింది. దీంతో ఫేస్బుక్ రక్షణ చర్యలు ప్రారంభించింది. ఫేస్బుక్లో మీ సమాచారం భద్రం అని స్పష్టం చేసింది. అయినప్పటికీ యూజర్లలో డేటా భయం ఉంది. అందుకే ఫేస్బుక్ వ్యక్తిగత సమాచారానికి మరింత రక్షణ కల్పించింది. తాజాగా పది వేల అప్లికేషన్లను తొలగించింది. ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారం లీక్ అవుతోందంటూ గత ఏడాది మార్చిలో వివాదం రేగింది. ఫేస్‌బుక్‌తో కలసి పని చేస్తున్న కేంబ్రిడ్జ్ అనలిటికా కారణంగా ఈ వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన ఫేస్బుక్ కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 400 మంది డెవలపర్లకు చెందిన యాప్స్‌ను తొలగిస్తూ ఫేస్బుక్ నిర్ణయం తీసుకుంది. ‘‘వినియోగదారుల అంతర్గత భద్రతకు ఈ యాప్స్ అంతగా ప్రమాదకరం కానప్పటికీ... చాలావరకు ఆ యాప్‌లు పరీక్షల దశలో ఉన్నాయి. దీంతోపాటు ఆ యాప్‌లు వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అందుకే వాటిని ఫేస్బుక్ నుంచి తొలగిస్తున్నాం’’ ఫేస్బుక్ సంస్థ బ్లాగులో రాసుకొచ్చింది. ‘‘సంస్థ విధివిధానాలకు విరుద్ధంగా ఫేస్బుక్ నుంచి వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సేకరించి వాటిని బహిర్గతం చేస్తున్న కొన్ని యాప్స్‌ని పూర్తిగా తొలగించాం. ఇంతటితో మా దర్యాప్తు పూర్తికాలేదు. ఈ చర్యల్లో భాగంగా యాప్ డెవలపర్స్‌కి వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్న అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ)లను తొలగించాం’’ అని ఫేస్బుక్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇకపై వినియోగదారుల వివరాలను సేకరించే అప్లికేషన్లు... ఏ విధంగా తమ యాప్‌నకు ఉపయోగకరమనేది తెలిజేయాల్సి ఉంటుందని ఫేస్బుక్ తెలిపింది. ఈ సంవత్సరం మొదట్లో కేంబ్రిడ్జ్ అనలిటికా కేసులో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) ఫేస్‌బుక్‌కు ఐదు బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. వీటితో పాటు కంపెని వ్యాపార నిర్వహణపై కూడా ఆంక్షలు విధించింది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా