newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

నోకియా ‘7.2’ వచ్చింది... ఎలా ఉందో చూడండి

20-09-201920-09-2019 10:29:16 IST
Updated On 20-09-2019 10:29:14 ISTUpdated On 20-09-20192019-09-20T04:59:16.140Z20-09-2019 2019-09-20T04:55:06.412Z - 2019-09-20T04:59:14.180Z - 20-09-2019

నోకియా ‘7.2’ వచ్చింది... ఎలా ఉందో చూడండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంచి కెమెరా, పర్‌ఫెక్ట్‌ బిల్డ్‌ క్వాలిటీ, బెస్ట్‌ ఓఎస్‌ అప్డేట్స్‌... ఇవన్నీ కావాలంటే ఇప్పటికీ వినియోగదారులు ఎంచుకుంటున్న సంస్థ నోకియా. ఇప్పుడు HMD గ్లోబల్‌ నుంచి నోకియా ఫోన్లు వస్తున్నా అదే నాణ్యతను, ప్రమాణాలను పాటిస్తున్నాయి. తాజాగా ఇదే వరుసలో మరో కొత్త మొబైల్‌ నోకియా 7.2ను నోకియా భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. పాత నోకియా ఫోన్లలో ఉండే ప్రధానమైన ఫీచర్లకు కొన్ని కొత్త ఫీచర్లను యాడ్‌ చేసి విడుదల చేసింది. ఇందులో ఆల్‌వేజ్‌ ఆన్‌ హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే ఉండబోతోంది. ఇంకా ఈ మొబైల్‌లో ఉండే ప్రత్యేకతలు ఏంటో చూద్దామా!

స్పెసిఫికేషన్స్‌ ఇవీ

నోకియా 7.2 మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఓఎస్‌తో పనిచేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్‌ 10 అప్‌డేట్‌ వస్తుంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది.  ఇది హెచ్‌డీఆర్‌ 10 సపోర్ట్‌ చేస్తుంది. గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ సౌకర్యం ఉంది. ఆక్టాకోర్‌ 660 ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది. ఇందులో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా ఉంది. 48 ఎంపీ ప్రధానమైన కెమెరా కాగా, 8 వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్ ఉన్నాయి. 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.  గత నోకియా ఫోన్ల తరహాలోనే జెసిస్‌ ఆప్టిక్స్‌ను లెన్స్‌ను వినియోగించారు. ఈ మొబైల్‌లో 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

ధర.. ఆఫర్లు ఇలా ఉన్నాయ్‌..!

* కొత్త నోకియా 7.2 ఆండ్రాయిడ్‌ వన్‌ ఫ్లాట్‌ఫాంపై పనిచేస్తుంది. ఈ మొబైల్‌కు త్వరలో ఆండ్రాయిడ్‌ 10 అప్‌డేట్‌ కూడా అందుబాటులోకి వస్తుంది. 

* తక్కువ బ్యాటరీ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉండే మరో ఫీచర్‌ ఇందులో ఉంది. ఆల్‌వేజ్‌ ఆన్‌ హెచ్‌డీఆర్‌ టెక్నాలజీతో  ప్యూర్‌ డిస్‌ప్లే ప్యానెల్‌ను నోకియా ఈ మొబైల్‌లో అందిస్తోంది. 

* నోకియా 7.2లో  4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధరను రూ.18,599గా నిర్ణయించారు. 

* 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధరను రూ.19,599గా ప్రకటించారు. 

* ఈ ఫోన్‌ ఆఫ్‌లైన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ నెల 23 నుంచి అందుబాటులో ఉంటుంది. 

* లాంచింగ్‌  ఆఫర్స్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుతో ఆఫ్‌లైన్‌ కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. 

* జియో వినియోగదారులకు ₹ 7,200 విలువ చేసే వోచర్లు ఇస్తారు. 

* నోకియా ఆన్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలుపై ₹ 2 వేలు గిఫ్ట్‌ కార్డ్‌ లభిస్తుంది. 

* ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. అయితే ఇది ఈ నెల 28 వరకు మాత్రమే.                                                                                                                                                                                                                       


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle