newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

నోకియా 55 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ .. అదరగొట్టే ఆఫర్లు

13-01-202013-01-2020 15:30:34 IST
2020-01-13T10:00:34.205Z13-01-2020 2020-01-13T10:00:32.540Z - - 18-01-2020

నోకియా 55 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ .. అదరగొట్టే ఆఫర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోకియా.. ఒకప్పుడు బేసిక్ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్. మార్కెట్లో 90 శాతం పైగా ఫోన్లు నోకియావే. అందుకే నాకు నీకు నోకియా.. అని పాడుకునేవారు. కానీ రానురాను నోకియా ఆధిపత్యం తగ్గిపోయింది. మళ్లీ తన సత్తా చాటేందుకు నోకియా అత్యాధునిక ఫీచర్లతో ఫోన్లను విడుదలచేస్తూనే వుంది. అంతేకాకుండా, స్మార్ట్ టీవీల వైపు హెచ్ఎండీ గ్లోబల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. 

2019 డిసెంబర్ నోకియా అత్యాధునిక  స్మార్ట్ టీవీని ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. వివిధ బ్యాంకుల డెబిట్ కార్డులపై ఆఫర్లు కూడా వున్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో EMI పై 5 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ వుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.ఈ ఆండ్రాయిడ్ టీవీలో కంపెనీ ఒక ఏడాది వారంటీ కూడా ఇస్తోంది. దీని కొనుగోలు మీద నోకాస్ట్ ఈఎంఐ అవకాశం ఉంది.

నోకియా స్మార్ట్ టివి ఆడియో టెక్నాలజీ, జేబీఎల్ సౌండ్ నాణ్యత ఉందని చెబుతోంది. 24వాట్స్ స్పీకర్లతో అత్యుత్తమ డీటీఎస్ అనుభవం పొందవచ్చు. నోకియా స్మార్ట్ టీవీలకు రూ.2,999ల విలువైన కంప్లీట్ టీవీ ప్రొటెక్షన్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అలాగే 3 సంవత్సరాలలో 30 శాతం తగ్గింపుతో ఎక్స్చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. 55 అంగుళాల 4K స్మార్ట్ టివి ధర రూ.41,999ల ధర వద్ద ప్రారంభమవుతుంది. ఆఫర్లలో కొనుగోలు చేస్తే గొప్ప తగ్గింపు పొందే అవకాశం ఉంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle