newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌... కలసి వస్తున్నాయ్‌!

07-11-201907-11-2019 14:38:05 IST
Updated On 07-11-2019 14:57:35 ISTUpdated On 07-11-20192019-11-07T09:08:05.730Z07-11-2019 2019-11-07T07:25:50.538Z - 2019-11-07T09:27:35.742Z - 07-11-2019

నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌... కలసి వస్తున్నాయ్‌!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ టీవీల రంగంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా, ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, స్పీకర్ల తయారీ మేటైన జేబీఎల్‌ కలసి ఓ టీవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటన చేసింది. నోకియా బ్రాండ్‌ పేరు మీద ఈ టీవీలను బారత మార్కెట్‌లో విక్రయించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.  ఈ స్మార్ట్‌ టీవీల్లో జేబీఎల్‌ సంస్థకు చెందిన స్పీకర్లు వాడబోతున్నారు. జేబీఎల్‌ సౌండ్‌ సిస్టంతో టీవీల్లో నాణ్యమైన ధ్వని అనుభూతి కలుగుతుందని పేర్కొంది. 

‘‘నోకియా కలిసి పని చేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నాం. నోకియాతో కలిసి పని చేయడం వల్ల మా సంస్థ ద్వారా భారత వినియోగదారులకు మరింత నాణ్యమైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు ఇచ్చేవాళ్లమవుతాం. అలాగే సాంకేతికతను మరింత విస్తరింపజేయడంలో ముందుంటాం. 200 మిలియన్ల మంది కొత్త కస్టమర్లను ఈ-కామర్స్‌ వైపు తిప్పుకునే లక్ష్యంతో మేం కొత్త వస్తువులను ప్రవేశపెడుతున్నాం. వీలైనంత త్వరగా మా లక్ష్యాన్ని అధిగమిస్తాం’’ అని ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫర్నిచర్‌ విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఆదర్శ్‌ మేనన్‌ పేర్కొన్నారు. 

‘‘ఫ్లిప్‌కార్ట్‌తో కలసి భారత్‌లో నోకియా బ్రాండ్‌తో స్మార్ట్‌ టీవీలు తీసుకొస్తున్నాం. నమ్మకం, నాణ్యతకు చిరునామా అయిన నోకియాకు ఇదో చారిత్రక అధ్యాయం. భారతీయుల టెక్‌ అవసరాలు, అభిరుచులు బాగా తెలిసిన ఫ్లిప్‌కార్ట్‌ లాంటి సంస్థతో జట్టు కట్టడం వల్ల మా ఉత్పత్తులు మరింతగా  వినియోగదారుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం.’’ అని నోకియా బ్రాండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విపుల్‌ మెహ్రోత్రా  చెప్పారు. 

ఫ్లిప్‌కార్ట్‌ గతంలో మోటొరోలాతోనూ ఇలాంటి అగ్రిమెంట్‌నే చేసుకుంది. భారత్‌లో తయారు చేసే స్మార్ట్‌ టీవీలను మోటొరోలా బ్రాండ్‌తో విక్రయించడం ఈ ఒప్పందం ఉద్దేశం. మరి ఈ స్మార్ట్‌ టీవీలను ఎప్పటినుంచి అందుబాటులోకి తెస్తారనే విషయమై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు నోకియా టీవీలను కూడా తీసుకురావాలని ఫ్లిప్‌కార్ట్‌ చూస్తోంది.  వీటిలో ఏది ముందు వస్తుందో చూడాలి.  అయితే, నోకియా టీవీలు ఇప్పటికే స్మార్ట్‌ టీవీ రంగంలో దూసుకుపోతున్న ఎంఐ టీవీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు అంటున్నాయి. 

Image result for flipkart join hands with nokia and jbl to bring smart tv

 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle