newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నోకియా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్

01-12-201801-12-2018 17:28:24 IST
Updated On 01-12-2018 17:28:22 ISTUpdated On 01-12-20182018-12-01T11:58:24.404Z01-12-2018 2018-12-01T11:58:22.353Z - 2018-12-01T11:58:22.356Z - 01-12-2018

నోకియా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చక్రం తిప్పేందుకు నోకియా పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. రీఎంట్రీ ఇస్తున్న సమయంలోనే విశేషణ ఆదరణ లభిస్తుందని ఆ సంస్థ ఆశించింది కానీ... అలా జరగలేదు. అప్పటికే ఇతర ఫోన్‌ల ప్రభావం పీక్స్‌లో ఉండడంతో ‘నోకియా’ను పెద్దగా పట్టించుకోలేదు. ఫీచర్స్ గొప్పగా లేకపోవడం, ధర కూడా ఎక్కువ కావడంతో జనాలు దానిపై దృష్టి సారించలేకపోయారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న నోకియా... అప్పట్నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరలకే ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే నోకియా 7.1 స్మార్ట్‌ఫోన్‌ని హెచ్ఎండి గ్లోబల్ సంస్థ లాంచ్ చేసింది. గత నెల లండన్‌లో విడుదల అయిన ఈ ఫోన్... తాజాగా భారత్ మార్కెట్‌ని పలకరించింది. భారీ బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదార్లకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.19,999గా నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోళ్ళు జరిపితే... 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.199 రీచార్జీపై 1 టీబీ 4జీ డేటాని పొందవచ్చు.

నోకియా 7.1  ఫీచర్లు:
5.84 అంగుళాల డిస్‌ప్లే
1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్‌
స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ పై
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3060 ఎంఏహెచ్ బ్యాటరీ

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle