నేవీ సంచలన నిర్ణయం: స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాపై బ్యాన్
30-12-201930-12-2019 13:28:29 IST
2019-12-30T07:58:29.235Z30-12-2019 2019-12-30T07:58:24.258Z - - 17-04-2021

భారత నౌకాదళం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నేవీలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడడం కుదరదని స్పష్టం చేసింది. నౌకాదళానికి చెందిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు సిబ్బందిని విశాఖపట్నంలో ఏపీ నిఘా వర్గాలు అదుపులోకి తీసుకోవడం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ ద్వారా దేశద్రోహానికి పాల్పడుతూ మన రహస్యాలను చేరవేసే వారిని పట్టుకున్న నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ముప్పు పొంచి ఉండటంతో సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. నౌకాదళ స్థావరాలు, డాక్‌యార్డ్‌లు, యుద్ధ నౌకల్లో నేవీ బ్బంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్‌లు, నెట్వర్కింగ్, బ్లాగ్స్, ఇ-కామర్స్ వెబ్సైట్లను వంటివి ఉపయోగించకూడదని పేర్కొంది. ఎన్ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్.. అదుపులో ఏడుగురు? ఇండియన్ నేవీలో 2017లో చేరిన ఉద్యోగులు 2018లో ఫేస్బుక్ ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకున్నట్లు గుర్తించారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హనీ ట్రాప్‌లో చిక్కుకున్న వీళ్లు.. హవాలా సొమ్ముకు ఆశపడి దేశ రహస్యాలను వారికి చేరవేసినట్టు అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. దీంతో నేవీలో సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా