newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

‘నెట్’ఇంట్లోనే గడిపేస్తున్నారు!

07-03-201907-03-2019 14:54:33 IST
Updated On 07-03-2019 14:56:32 ISTUpdated On 07-03-20192019-03-07T09:24:33.737Z07-03-2019 2019-03-07T09:23:47.641Z - 2019-03-07T09:26:32.218Z - 07-03-2019

‘నెట్’ఇంట్లోనే గడిపేస్తున్నారు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేస్తోంది. డేటా భారం తగ్గడంతో ఇండియాలోనూ ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్‌ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఐఎమ్‌ఆర్‌బీ సంస్థ వెల్లడించింది. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక్యూబ్‌ 2018 నివేదికలో పేర్కొంది.

ఇంటర్నెట్‌ కోసం దాదాపు 97 శాతం మంది మొబైల్‌ ఫోన్లనే వినియోగిస్తున్నారని, మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో మహిళల సంఖ్య 42 శాతంగా ఉంది. అంతేకాదు దేశంలోని జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది. సరాసరి ప్రతి వినియోగదారుడి దగ్గర ఒక బేసిక్ ఫోన్, అత్యాధునిక స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉందని, లేటెస్ట్ మోడల్ ఫోన్లను బాగా కొనుగోలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

Image result for internet on smart phone

2018‌తో పోలిస్తే దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 18శాతం వృద్ధి నమోదుచేసుకుంది. తొలిసారిగా నెటిజన్ల సంఖ్య 50 కోట్లు దాటేసింది. పల్లెల్లో ఇంటర్నెట్‌ వృద్ధి, వినియోగం జోరుగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అతి తక్కువ రేటుకి వోల్ట్, 4జీ ఫీచర్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో 87శాతం మంది రెగ్యులర్‌ వినియోగదారులే. వీరంతా కనీసం నెలకు ఒక్కసారైనా నెట్‌ వాడుతున్నారు.

రీఛార్జి చేసుకుంటున్నారు. మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 29 కోట్ల మంది పట్టణ ప్రాంతాల వారు కాగా, 25 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడం గమనించాల్సిన అంశం. ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య గత ఏడాదిలో పట్టణ ప్రాంతాల్లో 7 శాతం పెరిగింది.  గ్రామీణ ప్రాంతాల్లో అనూహ్యంగా 35 శాతం పెరగడం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగడానికి కారణం అయింది. 2018లో  గ్రామీణ ప్రాంతాల్లో 25 కోట్ల మేర ఉన్న ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 30 కోట్ల వరకూ చేరవచ్చు అని అంచనా. మొత్తం మీద దేశ జనాభాలో  సగం మంది ఇంటర్నెట్ వాడడం ఆయా కంపెనీలకు లాభాల పంట పండిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle