newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

07-04-202007-04-2020 15:09:58 IST
Updated On 07-04-2020 15:15:11 ISTUpdated On 07-04-20202020-04-07T09:39:58.657Z07-04-2020 2020-04-07T09:39:51.004Z - 2020-04-07T09:45:11.761Z - 07-04-2020

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నిత్యావసర సరుకులు సప్లయ్ చైన్‌కు తీవ్ర అంతరాయం కలిగిందనడం వాస్తవం. అయితే నిత్యావసరాల కొరతపై ప్రజల్లో ఆందోళనకు చెక్ పెడుతూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ సరికొత్త యాప్ ఆవిష్కరించాడు. ‘నైబర్‌వుడ్ సప్లై’ పేరుతో ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు స్టార్టప్ కంపెనీ ఎస్పర్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

‘‘వినియోగాదారులు తమ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి సురక్షితంగా, క్షేమంగా నిత్యావసరాలు తెచ్చుకునేలా మా టెకీ కిరణ్ ఆంటో ఓ యాప్‌ను ఆవిష్కరించారు. ప్రజలే కాంట్రిబ్యూటర్లుగా చేరి.. తమ ప్రాంతంలోని షాపులు, వ్యాపారులు, వారి ప్రాంతాలను పొందుపర్చడం  ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది...’’ అని ఎస్పర్ పేర్కొంది. నిత్యావసరాలు, మెడిసిన్, మాస్కులు, శానిటైజర్ల వంటి హెల్త్ కేర్ పరికరాలు దొరికే షాపులు ఈ యాప్‌తో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

లొకేషన్ సాయంతో ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో, అక్కడికెలా వెళ్లి కావాల్సినవి తెచ్చుకోవచ్చో ఈ యాప్ అలర్ట్ చేస్తుంది. నిత్యవసరాల జాబితా పొందుపర్చిన తర్వాత... వ్యాపారులు ఎప్పటికప్పుడు సరుకుల వివరాలు అప్‌డేట్ చెయ్యొచ్చు. కర్నాటక, కేరళ, న్యూఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈ యాప్ అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. 

‘‘ఈ యాప్ ద్వారా ఓ ప్రాంతంలో మంచి నెట్‌వర్క్ ఏర్పడడమే కాకుండా... నిత్యావరాలను నిశ్చింతగా తెచ్చుకునేందుకు  తోడ్పడుతుంది...’’ అని ‘నైబర్‌వుడ్ సప్లై’ సృష్టికర్త ఆంటో పేర్కొన్నాడు. 

ఒక నిర్దిష్టప్రాంతంలో అందుబాటులో ఉండే నిత్యావసర సరుకులను లొకేట్ చేయడానికి నైబర్‌వుడ్ సప్లై యాప్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఎస్పర్ కో ఫౌండర్, చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ శివ సుందర్ తెలిపారు. దేశప్రజలకు అతిగొప్ప ప్రయోజనం కలిగించేందుకు ఆండ్రాయిడ్ ఇన్నోవేషన్‌ను కంపెనీ ఉనికిలోకి తీసుకొచ్చిందన్నారు. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 ముఖ్య ప్రాంతాలలో ఈ యాప్‌ను యాక్టివ్‌గా ఉంచామని, కర్ణాటక, కేరళ, న్యూఢిల్లీల్లో కూడా ఇది అందుబాటులో ఉంటోందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   20 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle