నార్త్ ఇండియా యూజర్లకు.. గూగుల్ ఫ్లడ్ అలర్ట్స్
16-08-202016-08-2020 19:40:06 IST
2020-08-16T14:10:06.915Z16-08-2020 2020-08-16T14:10:02.951Z - - 14-04-2021

భారీవర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు.. నదులను తలపిస్తున్న రహదారులతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు, వరదలు కుమ్మేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. వరదలకు రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. చమోలీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఇళ్లు జల దిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలకు చమోలీ, భద్రినాథ్ మధ్య హైవేపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో టెక్ దిగ్గజం గూగుల్ ఫ్లడ్ అలర్ట్ అందిస్తోంది. ప్రజలకు సౌకర్యంగా వుండేందుకు వరద ప్రభావిత ప్రాంతాల సమాచారం అందిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ప్రాంతానికి అనుగుణంగా గూగుల్ అందించే హెచ్చరికలు, సలహాలు, సూచనలు అందుకోవచ్చు. జీపీఎస్ ఆధారంగా వర్షాలు పడుతున్న ప్రాంతాలను అలర్ట్ చేయనుంది. బీహార్, యూపీ, అసోం ప్రాంతాల్లో వరదల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా గూగుల్ అలర్ట్స్ అందుతాయి. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలి? తాము వెళ్ళబోయే ప్రాంతం గురించిన వివరాలు గూగుల్ అందిస్తోంది. కేంద్ర జలసంఘం ఆధారంగా వివిధ ప్రాజెక్టుల పరిస్థితిని వివరిస్తుంది. ఇప్పటికే అలర్ట్స్ అందిస్తున్నామన్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈసమాచారం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ భాషల్లో యూజర్లు ఎంపికచేసుకున్న భాషల్లో అలర్ట్స్ అందచేస్తోంది. ఉదాహరణకు బీహార్ లో వున్న వినియోగదారులు ఇంగ్లీషు మరియు హిందీలో, బెంగాల్ వినియోగదారులు ఇంగ్లీష్ మరియు బెంగాల్ భాషల్లో అలర్ట్స్ అందుకుంటున్నారు. తమ ప్రాంతంలో తాజా పరిస్థితి ఏంటో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇతర ప్రాంతాల్లో సమాచారం కూడా శోధించి అందుకోవచ్చు. తాజా వాతావరణ పరిస్థితులు, వర్షం పడే సూచనలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కలర్ కోడ్ మేప్ ద్వారా వరద ప్రాంతాలను గుర్తించవచ్చు. గూగుల్ మ్యాప్స్ సాయంతో వీటిని స్పష్టంగా అందుకోవచ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా