newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నాకు నీకు నోకియా.. 3.2 వచ్చేసింది

22-05-201922-05-2019 14:50:03 IST
2019-05-22T09:20:03.822Z22-05-2019 2019-05-22T09:19:49.651Z - - 22-04-2021

నాకు నీకు నోకియా.. 3.2 వచ్చేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోకియా.. ఒకప్పుడు మొబైల్ మార్కెట్ లీడర్. తర్వాత మిగతా స్మార్ట్ ఫోన్ల తాకిడికి అల్లాడిపోయింది. మళ్ళీ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. దీని పేరు నోకియా 3.2. దీని ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ. ఈ ఫోన్ మే 23 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ రెండు రోజులపాటు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. దీనిని బట్టి ఈ స్మార్ట్ ఫోన్ యూత్ కి బాగా నచ్చుతుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు. 

నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,990 నుంచి ప్రారంభమౌతోంది. 2 జీబీ ర్యామ్/16 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.10,790గా ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ ఆఫర్లను గమనిస్తే.. వొడాఫోన్, ఐడియా సబ్‌స్క్రైబర్లు రూ.2,500 విలువైన ప్రయోజనాలు పొందొచ్చు. ఒక్కొక్కటి రూ.50 ఖరీదైన 50 వోచర్లు లభిస్తాయి. రూ.199, ఆపై రీచార్జ్‌లపై ఈ వోచర్లను రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఫోన్ కొనుగోలుపై 10 శాతం తగ్గింపు సొంతం పొందవచ్చు. అంతేకాదు కంపెనీ లాంచ్ గిఫ్ట్ పేరుతో వెయ్యిరూపాయల గిఫ్ట్ కార్డు అందిస్తోంది. ప్రోమో కోడ్ ‘LAUNCHGIFT’ అని టైప్ చేయాలి. ఈ కార్డు పొందాలంటే కంపెనీ వెబ్ సైట్లో కొనుగోలుచేయాలి. ఇది పరిమిత కాలం ఆఫర్ మాత్రమే అంటోంది కంపెనీ. 

నోకియా 3.2 స్పెసిఫికేషన్స్ 

6.26 అంగుళాల స్క్రీన్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం

720 x 1520 పిక్సల్స్ డిస్ ప్లే

13 ఎంపీ రియర్ కెమెరా

5 ఎంపీ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

గూగుల్ అసిస్టెంట్ బటన్

కలర్స్ బ్లాక్ అండ్ స్టీల్ 

4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle