newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధర తక్కువ.. బ్యాటరీ ఎక్కువ.. ఫీచర్లు మక్కువ

25-09-201925-09-2019 18:55:50 IST
2019-09-25T13:25:50.140Z25-09-2019 2019-09-25T13:25:47.921Z - - 12-04-2021

ధర తక్కువ.. బ్యాటరీ ఎక్కువ.. ఫీచర్లు మక్కువ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పదివేల రూపాయల లోపు మొబైల్స్‌ మార్కెట్‌ ఈ మధ్య కాలంలో ఊపందుకుంటోంది. తక్కవ ధరలో మొబైల్స్‌ తీసుకొచ్చి ఫీచర్‌ మొబైల్స్‌ వాడుతున్న వారిని స్మార్ట్‌ ఫోన్ల వైపు తీసుకొచ్చింది. ఆరు నుంచి ఏడు వేల రూపాయల ధరతో అందరినీ ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఆ ప్రైస్‌ బ్రాకెట్‌లోకి రియల్‌మి, శాంసంగ్‌ వచ్చాయి. దీంతో పోటీ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని షావోమీ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెడ్‌మి 8ఏ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ ప్రారంభ ధర ₹ 6,499. 

శాంసంగ్‌ గెలాక్సీ M10, రియల్‌మి C2కు పోటీగా షావోమీ రెడ్‌మి 8Aను లాంచ్‌ చేసింది. అయితే ఈ మోడల్‌ భారత్‌ మార్కెట్‌కే పరిమితం. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో స్టార్టింగ్‌ వేరియంట్‌ అందుబాటులో ఉంటుంది. దీని ధర ₹ 6,499. అదే 3జీబీ ర్యామ్‌, 32జీబీ వేరియంట్‌ ధర ₹ 6,999. ఈ రెండు వేరియంట్లలోనూ మెమొరీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, ఓషన్‌ బ్లూ, సన్‌సెట్‌ రెడ్‌ రంగుల్లో రెడ్‌మి 8ఏ లభిస్తుంది. ఈ నెల 29 నుంచి ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ ఆఫర్ల కింద ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఈ మొబైల్‌ను ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌కు కూడా తీసుకొస్తున్నారు. సెప్టెంబర్‌ 30 నుంచి ఎంఐ హోమ్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. 

స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి...

ఇప్పటివరకు షావోమి  నుంచి వచ్చిన ‘రెడ్‌మి A’ సిరీస్‌లతో పోలిస్తే ఈ మొబైల్‌లో చాలా మార్పులు చేశారు.  8Aలో కెమెరా, బ్యాటరీ, డిజైన్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో మెరుగుపరిచారు. ఆరా వేవ్‌ గ్రిప్‌ డిజైన్ ఈ ఫోన్‌ ప్రత్యేకతల్లో కీలకమైంది. ఇది ఫోన్‌ చేతి నుంచి జారి పోకుండా ఉండటానికి సాయపడుతుంది. 6.22 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే  ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత ఎంఐయూఐ 10తో పని చేస్తుంది. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ ఉంటుంది. ముందు భాగంలో 8 ఎంపీ ఏఐ ఆధారిత సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక వైపు 12 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 363 సెన్సర్‌ ఇచ్చారు. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తుంది. ఈ ధరలో తొలిసారి షావోమీ టైప్‌-సి పోర్ట్‌ను అందిస్తోంది. 

Image result for xiaomi launches new budget mobile with best features 8a

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle