newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధరిత్రీ దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్

22-04-202022-04-2020 06:57:39 IST
2020-04-22T01:27:39.397Z22-04-2020 2020-04-22T01:27:29.084Z - - 17-04-2021

ధరిత్రీ దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. సమస్త ప్రాణికోటికి భూమి జీవనాధారం. కాలుష్యం నుంచి ఈ భూమిని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ప్రపంచంలోని సకల జీవరాశిని కడుపున పెట్టుకుని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై చాలామందికి అవగాహన లేదనే చెప్పాలి. 

మనం నివసించడానికి, ఆనందంగా జీవించడానికి ఈ ధరిత్రే ఆధారం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించకూడదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేంటి? కాలుష్యం, పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు, వాహనాల రొదలు, కొండల్ని, గుట్టల్ని తొలిచేయడం, పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాం. ధరిత్రిని కాపాడుకోవడానికి అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా 175 కంటే ఎక్కువ దేశాల్లో నిర్వహిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు,  కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మనల్ని కాపాడే ఈ భూమాతను మనం కూడా కంటికిరెప్పలా కాపాడుకోవాలి. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం రోజున మనం చేయగలిగిన పనులు కొన్ని వున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటడం,  మనం సొంత నీటి సీసాను,కిరణా సంచిని మన వెంట తీసుకునిపోవటం చేయాలి.

జంతుజాలాన్ని రక్షించేందుకు  శాఖాహారులుగా మారాలి.  స్థానికంగా పెరిగే కూరగాయలు కొనటం, మనం ఇంట్లో అవకాశం ఉంటే కూరగాయలు, పండ్ల చెట్లు, పూల చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం చేయాలి.  'ముద్రణ ని  తగ్గించటం, ఈ మెయిల్స్ వాడడం చేయాలి. మనం పేపర్ ఎక్కువగా వాడుతున్నామంటే చెట్లను నాశనం చేస్తున్నామని అర్థం. అలాగే. మోటారు వాహనాలను వాడకుండా నడక పెంచడం,  కాలుష్యం లేని రవాణా వాహనాలు, సైకిల్ తొక్కడం చేయాలి. సాధ్యమైనంత వరకూ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండే వస్తువులనే ఉపయోగించండి. డిస్పోజబుల్‌ ప్యాకేజీలకు దూరంగా ఉండండి. ఈరోజే కాదు ప్రతిరోజూ ధరిత్రీ దినోత్సవమే అనే భావనతో మెలగాలి. ఈ నేపథ్యాన్ని సూచిస్తే గూగుల్ రూపొందించిన ప్రత్యేక డూడుల్ ఆకట్టుకుంటోంది. ఈతరానికి అవగాహన కల్పిస్తోంది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle