ధరిత్రి దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్
22-04-201922-04-2019 12:31:15 IST
Updated On 22-04-2019 12:34:36 ISTUpdated On 22-04-20192019-04-22T07:01:15.623Z22-04-2019 2019-04-22T07:01:13.669Z - 2019-04-22T07:04:36.879Z - 22-04-2019

ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఈ సందర్భంగా ప్రఖ్యాత సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ రూపొందించింది. ఈ డూడుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమిని అమ్మగా భావిస్తాం. మనకు తల్లి జన్మనిస్తే.. ఆతల్లికే భూమి జన్మనిస్తుంది. మనం ప్రతి అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నాం. మన పీకల మీదకి వస్తేగానీ మేల్కోవడం లేదు. ప్రాణం పోతుందని తెలిస్తే గానీ జాగరూకులం కావడంలేదు. ఏ సమస్య అయినా తీవ్రరూపు దాల్చితేగానీ...ఇటు ప్రజలైనా...అటు ప్రభుత్వాలైనా స్పందిచడం లేదు. కష్టం ఎదురైనప్పుడే...దెబ్బ తగినప్పుడే...నివారణ చర్యలు గురించి అంతా ఆలోచిస్తున్నాం. ఎంతో విలువైన ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి.
పంచభూతాలైన నేల, గాలి, నీరు, నిప్పు, ఆకాశం వీటి విలువను గుర్తించి... సాగితేనే...బతుకు మెతుకు అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఇలాంటి ధరిత్రి దినోత్సవాలు చాలా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ సంస్థలు,ఐక్యరాజ్యసమితి శాఖలు ఏటా అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ధరిత్రికి జరుగుతున్న నష్టం గురించి పోరు పెడుతూనే ఉన్నాయి. అయినా మార్పు శూన్యం. వనరుల దోపిడీకి అడ్డుకట్టపడడంలేదు. అడవులు నరికివేయడం ఆగలేదు. పైగా ఏటికేడు సమస్య తీవ్రమవుతోంది. నీటి పొదుపు గురించి ఎవరూ ఆలోచించడంలేదు.
కరవు కాటకాలు. అతివృష్టి, అనావృష్టి బాధలు పెరుగుతూనే వున్నాయి. ప్రపంచానికి అన్నం, ఆహారపదార్ధాలు అందించే అన్నదాత సాగు చేయడానికి క్రమేపీ ఆసక్తి చూపడంలేదు. పంటలు పండించే రోజులు దూరం అవుతున్నాయి. ప్రధానంగా ...సకల జీవరాశులకు మూలమైన భూమి పెను ప్రమాదంలో చిక్కుకుంది. మానవుడి విధ్వంస చేష్టలకి...ప్రతీకగా జీవ శక్తిని కోల్పోతోంది. విలువైన. పర్యావరణ సమతుల్యానికి కారణమయ్యే అరుదైన జీవరాశులు తమ ఉనికికి కోల్పోతున్నాయి. అందుకే ఈ ఏడాది ధరిత్రి దినోత్సవం అరుదైన జీవరాశుల సంరక్షణకు కట్టుబడాలని సందేశం ఇస్తోంది. భూమిని కాపాడుకుందాం. భూమి రక్షణే మన రక్షణ. భూమి కాపాడితేనే మనకు జీవితం.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా