newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశవ్యాప్తంగా దిగ్గజ ఆటో కంపెనీల ప్లాంట్ల మూత: వెంటిలేటర్ల తయారీకి సిద్ధం

23-03-202023-03-2020 13:37:39 IST
Updated On 23-03-2020 14:45:00 ISTUpdated On 23-03-20202020-03-23T08:07:39.009Z23-03-2020 2020-03-23T08:07:35.985Z - 2020-03-23T09:15:00.566Z - 23-03-2020

దేశవ్యాప్తంగా దిగ్గజ ఆటో కంపెనీల ప్లాంట్ల మూత: వెంటిలేటర్ల తయారీకి సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 వ్యాధి విస్తరణ, రక్షణ చర్యల్లో భాగంగా  పలు ఆటో కంపెనీలు దేశవ్యాప్తంగా తమ  ఉత్పత్తులను నిలిపివేశాయి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా దేశంలో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని దిగ్గజ కంపెనీలు వెల్లడించాయి. వ్యాధి విస్తరణ మరింత ముదరకుండా ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయాలకు తాళాలు వేసేసాయి. ముఖ్యంగా అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా,  మహీంద్రా  అండ్ మహీంద్రా లాంటి కంపెనీలు  మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆర్థికమందగమనం, డిమాండ్ క్షీణత నేపథ్యంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయిన  ఆటో మొబైల్ పరిశ్రమ మరోసారి  దిగ్భంధనంలో చిక్కుకుంది.  

దీంతోపాటు కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించడం విశేషం. స్పోర్ట్-యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్  మహీంద్రా హర్యానాలోని  ప్లాంట్ లో ఉత్పత్తిని, కార్యకలాపాలను వెంటనే మూసివేస్తునట్టు తెలిపింది.  దీంతోపాటు మహారాష్ట్రలోని ఒక ప్లాంట్‌లో తయారీని నిలిపివేసిందని, సోమవారం నుంచి మరో రెండు ప్లాంట్లను నిలిపివేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తన ఉత్పాదక కర్మాగారాలలో కరోనావైరస్ రోగులకు వెంటిలేటర్లను తయారు చేయడం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  వెంటనే పనులు ప్రారంభిస్తామని  గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. హాలిడే రిసార్టులను తాత్కాలిక సంరక్షణ సౌకర్యాలుగా మలుస్తామని,  అలాంటి కేంద్రాలను నిర్మించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుందని  పేర్కొన్నారు. 

దేశంలో  అతిపెద్ద ఆటో హబ్‌లలో ఒకటిగా ఉన్న ముంబైలో అత్యధిక సంఖ్యలో  కరోనావైరస్ కేసులను నమోదయ్యాయి.  దీంతో మహారాష్ట్ర, పూణేలోని అనేక కార్ల తయారీదారులు ఉత్పత్తిని నిరవధికంగా లేదా మార్చి 31 వరకు నిలిపివేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసాయి.  మార్చి 31 వరకు  పూణే ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తామని మెర్సిడెస్ బెంజ్,  ఫియట్ ,  బైక్ తయారీదారు బజాజ్ ఆటో ప్రకటించాయి. భారతదేశం, బంగ్లాదేశ్, కొలంబియాలోని అన్ని ప్లాంట్లలో తయారీని నిలిపివేసినట్లు  ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఆదివారం తెలిపింది. పూణేలోని తన ప్టాంట్ లో మూడు వారాలపాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, తమ  ఉద్యోగుల భద్రతకు భరోసా ఇస్తున్నట్లు ఫోక్స్ వ్యాగన్ తెలిపింది. 

మహారాష్ట్రలోని తన కార్ల కర్మాగారంలో కార్యకలాపాలను  బాగా  తగ్గించామనీ, కరోనావైరస్ గురించి ఆందోళనలు తీవ్రతరం అయితే  మూసివేయడానికి సిద్ధమని టాటా మోటార్స్ ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తం చేసింది. మెర్సిడెస్ బెంజ్ ,  ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ లాంటి కంపెనీలు  ప్లాంట్ల మూసివేత నిర్ణయాన్ని ఆదివారం  ప్రకటించాయి.  ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిలిపివేస్తున్న గ్లోబల్ దిగ్గజం  ఐషర్ మోటార్స్  తెలిపింది. యూరప్, అమెరికా కెనడా , మెక్సికోలలో వాహనదారులు ప్లాంట్లను మూసివేత నిర్ణయాన్ని గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా కరోనావైరస్  కారణంగా  ప్రపంచ మరణాల సంఖ్య 13,000 దాటింది. భారతదేశంలో ఇప్పటివరకు  సుమారు 400 మందికి పైగా ఈ వ్యాధి సోకగా,  ఏడుగురు చనిపోయారు. దేశవ్యాప్తంగా  రైలు, మెట్రో సేవలు నిలిచిపోయాయి. మార్చి 31 వరకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   12 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle