newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

దుమ్మురేపిన జియో..37 కోట్లు కస్టమర్లు

22-01-202022-01-2020 18:01:25 IST
2020-01-22T12:31:25.447Z22-01-2020 2020-01-22T12:31:19.061Z - - 26-02-2020

దుమ్మురేపిన జియో..37 కోట్లు కస్టమర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటుపడింది యువత. దేశ మొబైల్స్, డేటా వినియోగంలో విప్లవం తెచ్చింది రిలయెన్స్ జియో. బేసిక్ 4జీ ఫోన్ తో పాటు డేటా ఛార్జీలను కూడా అందరికీ అందుబాటులోకి తేవడంతో సబ్ స్కైబర్ల సంఖ్యలో నెంబర్ వన్ స్థానానికి చేరింది. దీంతో దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్‌ జియో  అవతరించిందని ట్రాయ్ తెలిపింది.

టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజా నివేదిక ప్రకారం 2019 నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. రెండవస్థానాన్ని 33.62 కోట్ల చందాదారులతో వొడాఫోన్‌ ఐడియా దక్కించుకున్నాయి. ఇక భారతీ ఎయిర్ టెల్ 32.73 కోట్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్‌ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు తగ్గడం విశేషం. అదే విధంగా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కస్టమర్లు కూడా భారీగా పెరిగారు.

అక్టోబర్ 2019 నాటికి 461.73 మిలియన్ల మంది ఎంఎన్ పీకి అప్లయ్ చేస్తే ఆ సంఖ్య నవంబర్ నాటికి 466.62 మిలియన్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా తొలిసారి హర్యానాలో నవంబర్ 25, 2010న ఎంఎన్ పీని అమలు చేశారు. తర్వాత 2011 జనవరి 20 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ఎంఎన్ పీ వినతులు ఎక్కువగా వచ్చాయి. అక్టోబర్ 2019లో 38.90 మిలియన్లు కాగా, అది నవంబర్ 2019 నాటికి 39.28 కి పెరిగాయి. వైర్ లైన్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య ప్రభుత్వ రంగ సంస్థలకు 61 శాతం వుంటే ప్రైవేటు ఆపరేటర్ల వాటా 39శాతంగా వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle