దీపావళి నుంచి ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ‘అమెజాన్’
11-10-201911-10-2019 10:47:54 IST
2019-10-11T05:17:54.389Z11-10-2019 2019-10-11T05:17:51.261Z - - 14-04-2021

ఫుడీలూ... మీరు ఈ దీపావళి నుంచి మీరు అమెజాన్ ఆప్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా వస్తా వస్తా అంటున్న అమెజాన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి దీపాల పండగ రోజు వస్తోందని తాజా సమాచారం. ఆహార వ్యాపార రంగంలోకి అమెజాన్ వస్తుందని చాలా రోజులుగా వినిపిస్తున్నా ఇప్పుడు తేదీపై స్పష్టత వస్తోంది. స్విగ్గీ, జొమాటోకు పోటీగా దివాళీ నుంచి అమెజాన్ రంగంలోకి దిగబోతోందని సమాచారం. 500 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో అమెజాన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి వస్తోంది. పోటీని తొలి రోజుల నుంచి తట్టుకొని నిలబడేలా అన్ని హంగులు అద్దుకొని రంగంలోకి దిగబోతోందని సమాచారం. ‘‘మేం ఇప్పటివరకు ప్రవేశించిన అన్ని వ్యాపారాల్లోనూ అదరగొట్టాం’’ అని అమెజాన్ ప్రతినిధి చెబుతున్నారు. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో వసూలు చేస్తున్న రెస్టరెంట్ కమిషన్‌లో నాలుగో శాతమే వసూలు చేయనుందని తెలుస్తోంది. స్విగ్గీ, జొమాటో ప్రస్తుతం రెస్టరెంట్ల నుంచి 20 శాతం వరకు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన అమెజాన్ ఐదు శాతమే వసూలు చేయబోతోందన్నమాట. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ఉచిత డెలివరీ సదుపాయాన్ని అందించాలని చూస్తోంది. స్విగ్గీ తరహాలో క్లౌడ్ కిచెన్లను కూడా ఏర్పాటు చేయాలని చూస్తోంది. అంటే ఆ రెస్టరెంట్లలో తయారు చేసిన ఆహారం కేవలం అమెజాన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పటికే డెలివరీ ఏజెంట్లను కూడా రిక్రూట్ చేసుకుంటుందోట. ఇక అమెజాన్ పే వ్యాలెట్‌తో పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారని తెలుస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా