newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

దటీజ్ మోడీ.. ట్విట్టర్లో 5కోట్లమంది ఫాలోవర్లు

11-09-201911-09-2019 15:27:54 IST
Updated On 11-09-2019 15:27:50 ISTUpdated On 11-09-20192019-09-11T09:57:54.738Z11-09-2019 2019-09-11T09:56:49.824Z - 2019-09-11T09:57:50.201Z - 11-09-2019

దటీజ్ మోడీ.. ట్విట్టర్లో 5కోట్లమంది ఫాలోవర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నరేంద్ర మోడీ.. భారత ప్రధానిగా ఆయన అందరికీ చిరపరిచితం. విదేశాల్లో ఎక్కువ సార్లు పర్యటించిన చరిత్ర కూడా ఆయనది. తాజాగా ఆయన మరో ఘనత సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయనను ఫాలో అవుతున్న ట్విట్టర్ ఫాలోవర్లు ఏకంగా 5 కోట్లు దాటిపోయారు. ప్రధాని మోడీ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతారు. ఏ చిన్న విషమమైనా, విదేశీ పర్యటన అయినా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు మోడీ.

Image

ఏ దేశానికి వెళ్ళినా, అక్కడ వివిధ వేదికలలో పాల్గొన్నవి ఆయన చేసిన ప్రసంగాలు అయన చూసిన ప్రదేశాలు మరియు ఆయన కలిసిన వ్యక్తుల వివరాల గురించి అయన తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉంటారు. . భారత రాజకీయనాయకులు ఎవరూ మోడీ దరిదాపుల్లో లేరు. 

అమెరికా ప్రస్థుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు 64 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 108 మిలియన్ల ఫాలోవర్స్‌తో ప్రపంచలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ప్రధాని మోడీ 2009 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. 2014 లో ప్రధాని పదవిని చేపట్టడంతో ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరగడం ప్రారంభమయింది. ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ప్రపంచలోనే మొదటి ముగ్గురు నాయకులలో మోడీకి స్థానం దక్కింది. 

మొత్తం 50 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో చైనాకు చెందిన జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అప్పటి బ్రిటిష్ ప్రధాని థెరిసా మే, ఇజ్రాయెల్‌కు చెందిన బెంజమిన్ నెతన్యాహు కంటే మోడీ కంటే ముందు వరుసలో ఉన్నట్టు సర్వే తెలిపింది. తాజాగా సర్జికల్ స్ట్రయిక్స్ 2, ఆర్టికల్ 370 వంటి చారిత్రాత్మక విధానాలతో ఆయన ముందుకెళ్ళిపోయారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle