దటీజ్ బెంజ్.. చంద్రయాన్2 పై ఇంట్రెస్టింగ్ ట్వీట్
07-09-201907-09-2019 15:23:30 IST
Updated On 07-09-2019 15:24:39 ISTUpdated On 07-09-20192019-09-07T09:53:30.172Z07-09-2019 2019-09-07T09:53:26.362Z - 2019-09-07T09:54:39.046Z - 07-09-2019

బెంజ్ కారు స్టేటస్ కి సింబల్. అలాంటి బెంజ్ కారు మిర్రర్ లో చంద్రయాన్ 2 ఇమేజ్ కనిపించడంతో అంతా ఎగ్జయిటింగ్ అయ్యారు. చంద్రయాన్ 2 పై ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ వినూత్నంగా స్పందించింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ..భారత ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఇస్రో సంస్థకు ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను ట్వీట్ చేసింది.
కారు సైడ్ మిర్రర్లో జాబిల్లిని చాలా దగ్గరగా ఫోకస్ చేసింది. ‘ఆబ్జెక్ట్స్ ఇన్ద మిర్రర్ ఆర్ క్లోజర్ దేన్ దే అపియర్’’ అని హెచ్చరించే మిర్రర్ ఫోటో ట్వీట్ లో పెట్టింది. ఈట్వీట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారు జామున చంద్రయాన్-2 కీలక ఘట్టం పూర్తైంది. చంద్రుడికి 2.1 కిలో మీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో టెన్షన్ నెలకొంది. ల్యాండర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలోనే 300 మీటర్ల దూరంలోనే విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోవడంతో ఇస్రో ఛైర్మన్ శివన్ భావోద్వేగానికి గురికావడం, నరేంద్రమోడీ ఆయన్ని స్వయంగా ఓదార్చిన సంగతి తెలిసిందే. సిగ్నల్స్ నిలిచిపోయిన విషయాన్ని ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రధానికి వివరించారు.
అయితే ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ధైర్యం చెప్పారు. మీరు సాధించింది తక్కువేమీ కాదు, భవిష్యత్తుపై ఆశావాహ థృక్పథంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు సూచించారు. చంద్రయాన్ 2 లో ఏర్పడిన సాంకేతిక సమస్య గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తున్నారుు. కమ్యూనికేషన్ డేటాను విశ్లేషిస్తున్నట్టుగా ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ లో సమస్యలు తలెత్తడానికి కారణం ఏంటో తేలాల్చి ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా