newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తక్కువ రేటుతో డేటా సేవలు ఇకపై అసాధ్యం.. సునీల్ భారతి మిట్టల్

26-08-202026-08-2020 09:42:30 IST
Updated On 28-08-2020 13:30:23 ISTUpdated On 28-08-20202020-08-26T04:12:30.370Z26-08-2020 2020-08-26T04:12:24.408Z - 2020-08-28T08:00:23.089Z - 28-08-2020

తక్కువ రేటుతో డేటా సేవలు ఇకపై అసాధ్యం.. సునీల్ భారతి మిట్టల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తక్కువ రేటుతో ఇంటర్నెట్ డేటా సేవలు అందించడం ఇకపై కుదరదని టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ తేల్చి చెప్పింది. ఇంతవరకు జరుగుతున్నట్లుగా తక్కువ ధరకే డేటా ఇస్తే దేశంలో టెలికాం పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థమవుతుందని భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ స్పష్టం చేశారు.

సునీల్ మిట్టల్ ప్రకటన బట్టి రాబోయే ఆరునెలల్లో మొబైల్ సేవల ధరలు పెరుగుతాయని తెలస్తోంది. కేవలం 160 రూపాయలకే నెలకు 16 జీబీ డేటాను ఇవ్వడం కంటే మించిన విషాదం మరొకటి లేదని సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు

అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ  వినియోగం మాత్రం ఒక విషాదమే అని మిట్టల్ తేల్చి చెప్పారు. నెలకు 1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. 

భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. 

కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ  స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250  మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. 

మిట్టల్ సూచించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు  చెల్లిస్తున్న వారు రెట్టింపు  కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle