తక్కువ ధరలో షావోమీ కొత్త ఫిట్నెస్ బ్యాండ్
23-11-201923-11-2019 09:45:21 IST
2019-11-23T04:15:21.180Z23-11-2019 2019-11-23T04:15:19.286Z - - 20-04-2021

భారత మార్కెట్లోకి మరో ఫిట్నెస్ బ్యాండ్ వచ్చింది. భారత ట్రెండ్‌కి తగ్గట్టుగా షావోమీ మరో బ్యాండ్‌ని తీసుకొచ్చింది. ఎంఐ బ్యాండ్ 3ఐ పేరిట కొత్త బ్యాండ్‌ను లాంచ్ చేసింది. ఎంఐ బ్యాండ్3కి కొనసాగింపుగా ఎంఐ బ్యాండ్ 4ను ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంఐ బ్యాండ్ 3ఐ రూపంలో తక్కువ ధరకే బ్యాండ్‌ని తీసుకొచ్చింది.
ఎంఐ బ్యాండ్ 3ఐలో 0.78 అంగుళాల మోనోక్రోమ్ వైట్ అమోలెడ్ టచ్ డిస్ప్లే ఉంటుంది. 110 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఇస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జి చేస్తే 20 రోజుల బ్యాకప్ వస్తుందని షావోమీ చెబుతోంది. ఈ బ్యాండ్‌ను 2.5 గంటల్లో దీన్ని ఫుల్‌ఛార్జ్ చేయొచ్చు. కాల్స్, నోటిఫికేషన్ అలర్ట్స్, స్టెప్ కౌంట్, కాలరీ ట్రాకింగ్ వంటి కీలక ఫీచర్లు ఈ బ్యాండ్‌లో ఉన్నాయి. ఈ బ్యాండ్ బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తుంది. ఎంఐ సొంత యాప్ ఫిట్ యాప్ ద్వారా రోజువారీ యాక్టివిటీలు, స్లీప్ ప్రోగ్రెస్‌ను చూసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 4.4, ఐవోఎస్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఆపై వెర్షన్ల మొబైల్స్‌లో ఇది పని చేస్తుంది. తాజా వాతావరణ సమాచారంతోపాటు రాబోయే మూడు రోజుల వాతావరణ విశేషాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. బేసిక్ వాటర్‌ప్రూఫ్ సదుపాయం ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దీన్ని ధరించొచ్చు. నలుపు రంగు వేరియంట్‌ను మాత్రమే మార్కెట్లోకి తీసుకొచ్చారు.
షావోమీ సొంత వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఈ బ్యాండ్‌ను కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ. 1,299. గతేడాది సెప్టెంబర్‌లో రూ. 1,999 ధరతో ఎంఐ బ్యాండ్ 3ను తీసుకొచ్చారు. ఆ తర్వాత దాని ధరను రూ. 1,799కు తగ్గించారు. ఇటీవల విడుదలైన ఎంఐ బ్యాండ్ 4 ధర రూ. 2,299. గతంలో కూడా ఎంఐ బ్యాండ్స్ లైన్ తక్కువ ధరకు వచ్చేలా హెచ్ఆర్ఎక్స్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘ఐ’ సిరీస్‌ను తీసుకొచ్చింది. బేసిక్ ఫిట్నెస్ బ్యాండ్ కావాలంటే దీనిని ట్రై చేయొచ్చు.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా