తక్కువ ధరకే... అదిరిపోయే ఫీచర్లతో...
15-11-201815-11-2018 18:37:25 IST
Updated On 15-11-2018 20:03:29 ISTUpdated On 15-11-20182018-11-15T13:07:25.219Z15-11-2018 2018-11-15T13:07:14.806Z - 2018-11-15T14:33:29.944Z - 15-11-2018

మొబైల్‌లాగే టెలివిజన్ కూడా మానవుని నిత్య జీవితంలో విడదీయలేని వస్తువుగా మారిపోయింది. ఇంటికి వెళ్ళగానే అన్ని మర్చిపోయి ప్రతిఒక్కరూ టీవీకే అతుక్కుపోతారు. అందుకే... జనాలకు మరింత సులువుగా ఉండేలా టివిల్లో సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపుతున్నాయి వాణిజ్య సంస్థలు...! ఇప్పటికే మార్కెట్లో మొబైల్స్‌లాగే స్మార్ట్ టివీల పోటీ తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఫీచర్స్‌తో కొంగొత్త టివిలను లాంచ్ చేస్తున్నారు. తాజాగా TCL సంస్థ ప్రీమియం స్మార్ట్ టీవీ సెగ్మెంట్లో కొత్త సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. హైఎండ్ ఫీచర్లతో తన లేటెస్ట్ స్మార్ట్ టీవి TCL X4 QLEDని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దాదాపు 65 అంగుళాల UHD display గల ఈ టివి... అదిరిపోయే ఇమేజ్ వ్యూయింగ్ అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు... వినసొంపైన డీటీఎస్ టెక్నాలజీ ఆడియోని ఇందులో పొందుపరిచారు. ఇందులోని ఫీచర్స్ : * ఈ టీవి 3840 x 2160 పిక్సెల్స్ Resolution Quantum Dot (QLED) displayతో వచ్చింది. ఇందులో చిత్రాలు IPS LCD panel కన్నా మరింత స్పష్టంగా కనిపిస్తాయి. MEMC 120Hz అనే కొత్త ఆల్గారిధమ్ ద్వారా మల్టీ మీడియాలో అదిరిపోయే అనుభూతిని ఈ టీవీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఫుల్ మెటాలిక్ ఫ్రేమ్‌తో దీన్ని తీర్చిదిద్దారు. గేమింగ్ ప్రియులకు కావాల్సిన కొత్త ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. * ఈ టీవీలో ఆరు స్పీకర్లతో కూడిన అదిరిపోయే సౌండ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. 40W సౌండ్ ఔట్పుట్ ద్వారా వినియోగదారులకు సినిమా ధియేటర్లోని అనుభూతిని కలిగించనుంది. డాల్బీ డిజిటల్, డిటిఎస్ ప్రీమియమ్ సపోర్టు కూడా ఉండటంతో హై క్వాలిటీ సౌండ్‌ని ఆస్వాదించొచ్చు. * గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ బేస్డ్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌ని ఈ టివి అందిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ ఆఫర్ చేసే అన్ని రకాల గేమ్స్ కూడా ఇందులో మీరు ఆడుకోవచ్చు. 4కె, హెచ్డి కంటెంట్‌ని ఈ ఓఎస్ ద్వారా యూజర్లు వీక్షించవచ్చు. 2.5 జిబి ర్యామ్‌తో పాటు 16 జిబి ఇంటర్నెల్ స్టోరేజ్ ఇందులో ఉంటుంది. * యుఎస్బి-ఎ పోర్ట్ ద్వారా కీ బోర్డు, మౌస్, సెటాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్‌లను పీసీకి అటాచ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.1,09,990గా ఉంది. ఎన్నో ఫీచర్స్ ఉన్న ఈ టివి ఇంత ధరలో రావడం ఇదే తొలిసారి అని అంటోంది సంస్థ...! త్వరలోనే ఇంతకంటే తక్కువ ధరలకు 32, 40, 43, 49 ఇంచుల టీవీ మోడల్స్‌ను కూడా విడుదల చేయబోతున్నట్టు టీసీఎల్ వెల్లడించింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా