డ్యూయల్ మోడ్ 5జీతో ఒప్పో ‘రీనో 3 ప్రో’..
29-11-201929-11-2019 15:08:47 IST
2019-11-29T09:38:47.725Z29-11-2019 2019-11-29T09:38:43.440Z - - 17-04-2021

ఒప్పో నుండి వచ్చిన మొబైళ్లలో ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం, ఆదరణ పొందిన మోడళ్లు రీనో సిరీస్. ఎనిమిది నెలల కాలంలోనే ఈ సిరీస్‌లో రెండు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మూడో రీనో రాబోతోంది. రీనో 2 వచ్చిన నాలుగు నెలలకు రీనో3 రాబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. రీనో 3 సిరీస్ మొబైళ్లలో 5 జీ సాంకేతికత ఉండబోతోంది. అది కూడా డ్యూయల్ మోడ్ 5జీ ఉంటుందని తెలుస్తోంది. దీనిని వచ్చే నెలలో చైనాలో తొలుతగా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు టెక్ వర్గాల ప్రకారం తెలిసిన ఫీచర్లు చూస్తే... ఒప్పో రీనో3ప్రోలో 7.7 మిల్లీ మీటర్ మందం ఉంటుంది. రెడ్మీ కె30 తరహాలోనే ఇందులోనూ డ్యూయల్ మోడ్ 5 జీ సపోర్టు ఉంటుంది. 5జీ సాంకేతికతతో వస్తున్న అతి పలుచని ఫోన్ ఇదేనని ఒప్పో చెబుతోంది. ఇందులో కూడా ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉండబోతోందని తెలుస్తోంది. అయితే కెమెరా కోసం పంచ్ హోల్ ఇవ్వబోతున్నారు. ఫోన్ లెఫ్ట్ కార్నర్లో ఈ ఫ్రంట్ కెమెరా ఉండబోతోందని సమాచారం. ఇందులో 6.5 అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే ఉండబోతోందని భోగట్టా. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లేను అందిస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 735 ప్రాసెసర్‌తో ఈ మొబైల్ పని చేస్తుందట. వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉండబోతోంది. అందులో సోనీ ఐఎంఎక్స్ 686 సెన్సర్‌తో 60 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉంఉటంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండబోతోంది. 30 వాట్ వూక్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్కిది సపోర్టు చేస్తుంది. అయితే దీని ధరపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. 5జీ సాంకేతికతతో హానర్ వీ30 సిరీస్ మొబైళ్లు ఇటీవల లాంచ్ చేసింది. మరోవైపు డిసెంబరు 10న షావోమీ నుంచి కూడా 5 జీ ఫోన్ రాబోతోంది. రెడ్మీ కె30 పేరుతో దీనిని తీసుకొస్తోంది. ఇంకోవైపు రియల్మీ నుండి రియల్మీ ఎక్స్ 50 పేరుతో 5 జీ ఫోన్‌ను తీసుకొస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా