డేటింగ్ యాప్‌ల పిచ్చిలో యువత
29-01-202029-01-2020 17:38:22 IST
Updated On 29-01-2020 18:07:28 ISTUpdated On 29-01-20202020-01-29T12:08:22.608Z29-01-2020 2020-01-29T12:06:46.722Z - 2020-01-29T12:37:28.985Z - 29-01-2020

డేటింగ్.. యువత ఆచరిస్తున్న విదేశీ సంస్కృతి. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది యువత ఈ డేటింగ్ యాప్ లకు బానిసలుగా మారుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడంతో యాప్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. డేటింగ్ యాప్ లు ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే ఈ యాప్ లు డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

గ్లీడెన్ అనే యాప్ (Gleeden App) అంటే పడిచచ్చిపోతున్నారు యువత. మనదేశానికి చెందిన సుమారు 8 లక్షల మంది వివాహితులు గ్లీడెన్ డౌన్లోడ్ చేసుకున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ఆరంభంలోనే వీరి సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోవడం గమనించాల్సిన అంశం. ఈ యాప్ డౌన్లోడ్స్ పెరుగుతున్నాయంటే.. దాని ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. వివాహేతర సంబంధాలకు పాల్పడాలని చూస్తున్న యువత ముఖ్యంగా వివాహితులను అట్రాక్ట్ చేస్తున్నారు.
ఈ ఫ్రెంచ్ ఆన్లైన్ డేటింగ్ యాప్ 567 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. దీనిని బట్టి పెళ్లికాని యువతీ, యువకులు, పెళ్లయి అసంతృప్తితో వున్నవారు ఈ యాప్ ని ఆశ్రయిస్తున్నారు. వివాహేతర సంబంధాల పట్ల యువత మోజు పడడం, అందుకోసం ఎలాంటి యాప్ ల నైనా ఆశ్రయించడం సమాజంలో పెచ్చుమీరుతున్న సంస్కృతికి అద్దం పడుతోంది. ముఖ్యంగా న్యూ ఇయర్ సమయంలో డేటింగ్ సైట్లకు పెరిగిన సబ్ స్క్రైబర్ల సంఖ్య మతిపోగొడుతోందని చెప్పాలి. జనవరి మొదటి వారంలో గ్లీడెన్పై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది.
దీనికి ముందు రెండు వారాల్లో కొత్త రిజిస్ట్రేషన్లతో పోల్చితే చందాదారులు 300 శాతం పెరిగారని గ్లీడెన్ సంస్థ తెలిపింది. దీంతో యాప్ ని కొంతకాలం లాక్ చేసేశారు. 2019 జనవరి మొదటి వారంలో గ్లీడెన్ చందాలు 295 శాతం పెరిగాయి. 2019 నవంబర్ నాటికి, మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా, పూణే, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడాలలో భారీ స్థాయిలో నమోదయ్యాయి.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ డేటింగ్ యాప్‌లకు మహిళలకు కూడా బానిసలు అవుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాలకు చెందిన మహిళలు గ్లీడెన్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. బెంగళూరు నగరానికి చెందిన మహిళలు, పురుషులు అత్యధిక మంది ఇందులో రిజిస్టర్ కావడం విశేషం.
గ్లీడెన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారిలో ఎక్కువమంది పురుషులు నాలుగైదు నగరాలనుంచి వచ్చారని నివేదికలు చెబుతున్నాయి. అందులో బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలున్నాయి, వీటితో పాటు అహ్మదాబాద్, జైపూర్, చండీఘర్, లక్నో, కొచ్చి, నోయిడా, విశాఖపట్నం , నాగ్‌పూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్ వున్నాయి.
హైదరాబాద్ కు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని యువకులు ఈ యాప్ మాయలో పడ్డారు. అయితే ఈ యాప్ వేస్ట్ అంటున్నారు. అసంతృప్తితో వున్నవారికి ఇది అంతగా ఉపయోగం లేనిదని, దీనిని నమ్ముకుంటే సమయం వృధా తప్ప వేరేది కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని యువకులు అంటున్నారు.


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
11 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా