డిఫాల్ట్ ఐఓఎస్ అప్లికేషన్లపై పట్టు సడలించిన ఆపిల్
23-02-202023-02-2020 15:04:26 IST
Updated On 24-02-2020 10:25:24 ISTUpdated On 24-02-20202020-02-23T09:34:26.158Z23-02-2020 2020-02-23T09:34:19.247Z - 2020-02-24T04:55:24.222Z - 24-02-2020

ఐటీ ఆధారిత సాంకేతిక జ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి కాలంలో కూడా లాభార్జన ధ్యేయంగా కలిగిన టెక్నాలజీ సంస్థలు తమ ఉత్పత్తులపై తమ ముద్రమాత్రమే ఉండాలని, తాము నిర్దేశించిన, పొందుపర్చిన యాప్స్ మాత్రమే ఉపయోగించుకోవాలని ఆంక్షలు విధిస్తూ అమలు చేస్తున్నాయి. దీంతో కంప్యూటర్లు, మొబైల్ ఉత్పత్తిదారీ సంస్థలు వినియోగదారులపై కనిపించని ఆంక్షలు విధిస్తూ వారు ఇతర సంస్థల ఉత్పత్తులవైపు కన్నెత్తకుండా తమకే కట్టుబడేలా జాగ్రత్తపడుతూ వచ్చారు. ఇన్నాళ్లు ఆ కోవలోనే నడిచిన ప్రముఖ హార్డ్‌వేర్ సంస్థ అపెల్ తన పంధాను మార్చుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారా సరికొత్త విప్లవానికి తెరతీసింది. ఈరోజుకీ ఏ మొబైల్ ఉత్పత్తిలో అయినా సరే డిఫాల్ట్ ఐఓఎస్ అప్లికేషన్లను మార్చుకోవడం సాధ్యపడటం లేదు. మీరు అపెల్ ఐఫోన్ లింకుపై క్లిక్ చేస్తే సఫారీ మాత్రమే ఓపెన్ అవుతుంది. కానీ అపెల్ ఇప్పుడు కాస్త పట్టు సడలించుకుని తమకు అవసరమైన డిఫాల్ట్ యాప్స్‌ని యూజర్లే ఎంచుకునే అవకాశం కల్పించింది. చాలా కాలంగా ఆండ్రాయిడ్ దీనికి అవకాశం కల్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ సాంకేతిక దిగ్గజ సంస్థలు ఐఓఎస్ ద్వారా ప్రభావితమయ్యాయి. ప్రత్యేకించి దాని యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ పట్ల మక్కువ చూపాయి. పర్సనల్ అసిస్టెంట్ టూల్ కి సంబంధించి ఈ రెండు సంస్థలు అపెల్ నుంచి కొన్ని మంచి ఐడియాలను స్వీకరించాయి. ఈ విషయంలో ఇవి క్యూపర్టినో కంపెనీని కూడా అధిగమించేశాయి. అయితే ఆపరేటింగ్ సిస్టమ్‌ను మెరుగుపర్చేందుకు జరుగుతున్న పోటీలో ముందుండటానికే ఐఓఎస్‌ను ప్రధానంగా ఇవి స్వీకరించాయనే చేదు నిజం కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఆ పోటీలో భాగంగానే సఫారీలోని డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్‌ను యూజర్లు స్వయంగా ఎంచుకోవడానికి అపెల్ అవకాశం కల్పించాయి. దీన్ని సాఫ్ట్ రంగంలో గుత్తాధిపత్యానికి తలుపులు మూయడమే అని కూడా చెప్పవచ్చు. ప్రముఖ ఆర్థిక వార్తల సంస్థ బ్లూమ్‌బెర్గ్ చెబుతున్నదాని ప్రకారం ఐఓఎస్ మరియు హోమ్ పాడ్ స్పీకర్లో పోటీపడటం కోసం అపిల్ కాస్త సడలుబాటు ప్రదర్శించింది. మొదటిసారిగా ఐఓఎస్ విభాగంలో యూజర్ తన సొంత డిఫాల్ట్ అప్లికేషన్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని అపెల్ కల్పించింది. ఇది చాలాకాలంగా విండోస్, ఆండ్రాయిడ్, మ్యాక్ ఓఎస్‌లో కూడా చాలాకాలంగా అమలులో ఉందనేది తెలిసిందే. అయితే ఈ మార్పు కారణంగా రెండు అప్లికేషన్లు ప్రభావితం అవుతాయి. అది బ్రౌజర్, ఈమెయిల్ క్లైంట్. అందచేత సఫారీ, మెయిల్ తమ డిఫాల్ట్ అప్లికేషన్ ప్రతిపత్తిని పోగొట్టుకుంటాయి. మొత్తం మీద చెప్పాలంటే సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి నిజమైన విప్లవం జరగబోతోంది. ఇప్పుడు యూజర్ క్రోమ్, జిమెయిల్ వంటి డిఫాల్ట్ అప్లికేషన్లను థర్డ్ పార్టీ అప్లికేషన్లుగా ఎంచుకుంటే, సఫారీ, మెయిల్ అనేవి ఇక డిఫాల్ట్ అప్లికేషన్లుగా తమంతట తాము ఓపెన్ కావు. మీ ఐఫోన్ నుంచి మెయిల్‌ని డిలెట్ చేస్తే అది డిఫాల్ట్ అప్లికేషన్‌గా ఐఫోన్లో ఉంటుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా