newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డిజిటల్‌ వెల్‌బీయింగ్‌లో ఈ కొత్త ఆప్షన్లు చూశారా!

25-10-201925-10-2019 09:59:26 IST
Updated On 26-10-2019 12:33:46 ISTUpdated On 26-10-20192019-10-25T04:29:26.800Z25-10-2019 2019-10-25T04:28:10.249Z - 2019-10-26T07:03:46.861Z - 26-10-2019

డిజిటల్‌ వెల్‌బీయింగ్‌లో ఈ కొత్త ఆప్షన్లు చూశారా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజూ అన్నేసి గంటలు మొబైల్‌లో తల దూర్చి ఏం చేస్తున్నావ్‌... రోజుకు ఎంత సేపు చూస్తున్నావో తెలుస్తోందా?  - చాలా రోజుల నుంచి ఇళ్లలో పెద్దవాళ్లు పిల్లల్ని, మొబైల్‌ ఫోన్‌ వాడే వాళ్లను చూసి అనే, అంటున్న మాటలివి. 

ఇప్పుడు ఈ మాటలు ఎవరో అనక్కర్లేదు. మీ మొబైలే చెబుతుంది. ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’ ఆప్‌ ద్వారా ఇది సాధ్యమైంది. గతేడాది గూగుల్‌ ఈ ఆప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఇందులో మీరు రోజూ మొబైల్‌ను ఎంతసేపు వాడుతున్నారు, ఏ ఆప్‌ ఎక్కువసేపు వాడుతున్నారు లాంటి విషయాలు దీని ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మరికొన్ని కొత్త ఆప్షన్లు తీసుకొచ్చారు.  

అన్‌లాక్‌ క్లాక్‌, పోస్ట్‌ బాక్స్‌, వి ఫ్లిప్‌, డిసర్ట్‌ ఐలాండ్‌, మార్ఫ్‌ పేరుతో ఐదు కొత్త ఆప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అన్‌లాక్‌ క్లాక్‌ ఆప్‌తో మీరు ఎన్నిసార్లు మొబైల్‌ను అన్‌లాక్‌ చేశారనేది మీకు తెలియజేస్తుంది. మీ మొబైల్‌లో కొత్త వాల్‌పేపర్‌ కనిపిస్తుంది. దానిపైనే మీ అన్‌లాక్‌ల సంఖ్య తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇది డిజిటల్‌ వెల్‌బీయింగ్‌కి షార్ట్‌ కట్‌గా కూడా పని చేస్తుంది. 

పోస్ట్‌ బాక్స్‌ ఆప్‌ నోటిఫికేషన్ల సమస్యకు చెక్‌ పెడుతుంది. మీ మొబైల్‌కు మీరు ఎప్పుడు నోటిఫికేషన్లు రావాలనుకుంటున్నారో ఈ ఆప్‌కు చెబితే మీకు ఆ పని చేసిపెడుతుంది. మీటింగ్‌, డ్రైవింగ్‌ లాంటి ఆప్షన్లు ఎంచుకుంటే మీకు కీలకమైన నోటిఫికేషన్లు మాత్రమే వస్తాయి. దీంతోపాటు ఈ యాప్‌ నోటిఫికేషన్లను తన దగ్గర పెట్టుకొని మీరు చెప్పిన సమయానికి వచ్చేలా చేస్తుంది. నోటిఫికేషన్ల టింగ్‌ టింగ్‌ సమస్య నుంచి దీని ద్వారా చెక్‌ చెప్పొచ్చు. 

వి ఫ్లిప్‌ ఆప్‌ను గేమ్‌ అని చెప్పొచ్చు. మీ స్నేహితులతో కలసి ఈ ఆట ఆడొచ్చు. ఎవరు ఎక్కువ సేపు మొబైల్‌ చూడకుండా ఉంటారనేది ఆట. ఎక్కువసేపు మొబైల్‌ చూడకుండా ఉన్నవారు గెలుస్తారు. మీ స్నేహితులతో తొలుత మొబైల్‌ను అన్‌లాక్‌ చేసినవాళ్లు ఓడిపోయినట్లు. ఆ విషయం మీ స్నేహితులకు ఆప్‌ ద్వారా తెలుస్తుంది. అలా ఎక్కువసేపు మొబైల్‌కు దూరంగా ఉన్నవాళ్లు విఫ్లిప్‌ విజేత అవుతారు.

ఎక్కువగా వాడే యాప్స్‌ను మొబైల్‌ హోం స్క్రీన్‌ మీద షార్ట్‌ కట్స్‌గా పెట్టుకుంటారు. లేదా వాటన్నింటినీ ఓ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. డిసర్ట్‌ ఐలాండ్‌ కూడా అలాంటిదే. మీరు ఎక్కువగా వాడే యాప్స్‌ను ఇందులో పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటినే వాడుతుంటారు కాబట్టి వేరే ఆప్స్‌ మీ దృష్టిని ఆకర్షించకుండా చూడొద్దు. దీని వల్ల అనవసరమైన ఆప్స్‌ మాత్రమే వాడొచ్చు. తద్వారా మొబైల్‌ యూజింగ్‌ టైమ్‌ తగ్గుతుంది. 

ఉదయం పూట నా ఫోన్‌ మెనూ ఒకలా ఉండాలి... సాయంత్రం ఇంకోలా ఉండాలి. వీకెండ్‌లో మరోలా ఉండాలి అని అనుకుంటున్నారా? మీకు మార్ఫ్‌ ఆప్‌ ద్వారా అలాంటి ఆప్షనే తీసుకొస్తోంది.  సమయం ప్రకారం మీ ఫోన్‌ మెనూ రెడీ అవుతుంటుంది. అంటే ఉదయాన్నే చూస్తే వెదర్‌, న్యూస్‌ ఆప్స్‌ ప్రధానంగా కనిపిస్తాయి. అదే సాయంత్రం చూస్తే మ్యూజిక్‌ ఆప్స్‌ లాంటివి కనిపిస్తాయి. వీకెండ్‌లో అయితే మెయిల్స్‌, వాట్సాప్‌ లాంటివి దూరంగా పెడుతుంది. 

అర్థమైందిగా కొత్త ఆప్స్ సంగతులు.. ప్రస్తుతానికి కొత్త ఆప్స్‌ కొంతమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మీకు అందుబాటులోకి వస్తే ఓసారి ట్రై చేయండి.

Image result for fine new apps are launched with digital wellbeing

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle