newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డార్క్ వాట్సాప్ వస్తోంది.. టీజర్ వచ్చేసింది

20-10-201920-10-2019 09:34:45 IST
2019-10-20T04:04:45.600Z20-10-2019 2019-10-20T04:04:42.227Z - - 17-04-2021

డార్క్ వాట్సాప్ వస్తోంది..  టీజర్ వచ్చేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్ లో మరో ఆసక్తికర ఫీచర్ రాబోతోంది. ఇటీవల విడుదలైన బీటా వెర్షన్ లో ఓ ఫీచర్ ను టెక్ విశ్లేషకులు గుర్తించారు. ఆప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇప్పుడు డార్క్ మోడ్ నామ జపం చేస్తున్నాయి. ఈ వరుసలోకి త్వరలో వాట్సాప్ కూడా వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. దీనికి సూచనగా ఓ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ లో కనిపిస్తోంది. దాని బట్టి చూస్తే డార్క్ మోడ్ వాట్సాప్ రావడానికి ఇంకెన్నో రోజులు పట్టదని టెక్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన 2.19.297 వెర్షన్ లో డార్క్ మోడ్ సూచనలు కనిపించాయి. ఆప్ ఓపెన్ చేసినప్పుడు మామలుగా ఆప్ ఓపెన్ అవ్వకుండా డార్క్ కలర్ లో స్క్రీన్ స్ప్లాష్ అవుతోంది. ఇదే డార్క్ మోడ్ కి టీజర్ అంటున్నారు. 

గత కొన్నాళ్లుగా వాట్సాప్ బిజినెస్ ఆప్ ఓపెన్ చేసినప్పుడు చాట్స్ కనిపించే ముందే డార్క్ కలర్ స్క్రీన్ మీద వాట్సాప్ లోగోతో స్ప్లాష్ స్క్రీన్ ఒకటి లోడ్ కనిపించేది.  ఆప్ లోడింగ్ టైమ్ లో ఈ స్క్రీన్ కనిపించేది. ఇప్పుడు ఇదే ఫీచర్ సాధారణ వాట్సాప్ లోనూ కనిపిస్తోంది. అయితే ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్ కింద కొంతమంది యూజర్లకు మాత్రమే కనిపిస్తోంది. 

ఇది డార్క్ మోడ్ రావడానికి ముందస్తు ప్రయత్నం అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. వాట్సాప్  లో డార్క్ మోడ్ ను తీసుకొస్తోందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి, రెండు స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి.  ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. 

మొబైల్ లో డార్క్ మోడ్ లేకపోయినా వాట్సాప్ డార్క్ మోడ్ ని వాడుకోవచ్చని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా ఫేస్ బుక్ సాంకేతికతను సిద్ధం చేస్తోందట. అయితే ఎప్పుడు ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొస్తారనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు డిస్అపియర్ మెసేజ్ ల మీద కూడా వాట్సాప్ పని చేస్తోంది. మీరు ఎంచుకున్న నిర్ణీత సమయం తర్వాత మీరు పంపిన మెసేజ్ లు డిలీట్ అయిపోవడం దీని ప్రత్యేకత. 

ఫేస్ బుక్ మెసెంజర్ లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఇచ్చింది. అంటే దానినే వాట్సాప్ లో తీసుకొస్తున్నారు. మరోవైపు మన దేశంలో చాలా రోజుల నుంచి బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉన్న వాట్సాప్ పేమెంట్స్ ను ఇప్పుడు ఇండోనేసియా లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశంలో పూర్తి స్థాయిలో త్వరలో లైవ్ లోకి తీసుకొస్తారని తెలుస్తోంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle