newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘డార్క్‌’ ఫేస్‌బుక్‌ కూడా సిద్ధమైందోచ్‌..

23-10-201923-10-2019 12:02:56 IST
Updated On 23-10-2019 17:10:02 ISTUpdated On 23-10-20192019-10-23T06:32:56.036Z23-10-2019 2019-10-23T06:32:54.008Z - 2019-10-23T11:40:02.118Z - 23-10-2019

‘డార్క్‌’ ఫేస్‌బుక్‌ కూడా సిద్ధమైందోచ్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డార్క్‌’ ఫేస్‌బుక్‌ కూడా సిద్ధమైందోచ్‌ ఫేస్‌బుక్‌ తన యూజర్‌ ఇంటర్ఫేస్‌ను రీడిజైన్‌ చేస్తోంది. ప్రస్తుతం టెక్‌ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌ డార్క్‌ మోడ్‌. అందుకే ఫేస్‌బుక్‌ కూడా డార్క్‌ మోడ్‌ను లాంచ్‌ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్‌ను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు అంతర్జాలంలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. వాటిని బట్టి చూస్తే ఫేస్‌బుక్‌ కేవలం డార్క్‌మోడ్‌ని మాత్రమే తీసుకురాకుండా... ట్విటర్‌ స్టైల్‌ డిజైన్‌ను కూడా తీసుకొస్తున్నారు.

దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లను ఇటీవల జరిగిన ఎఫ్‌8 డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో బయటికొచ్చాయి. కొంతమంది యూజర్లు వీటిని ట్వీట్‌ చేశారు. వాటి ప్రకారం చూస్తే కొత్త డిజైన్‌లో పెద్ద ఫాంట్‌, సింప్లిఫైడ్‌ లే అవుట్‌ ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఫేస్‌బుక్‌ లో ఇలాంటి డిజైన్‌ ఉండొచ్చు. 

కొత్త యూజర్‌ ఇంటర్ఫేస్‌కు సంబంధించి ఇప్పటికే కొంతమంది యూజర్లకు బీటా యాక్సెస్‌ ఇచ్చారట. ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే చిన్న టాగుల్‌ ద్వారా కొత్త లుక్‌ కి మారిపోయేలా ఇచ్చారట. దాన్ని బీటా యూజర్లు ఇంకా వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలను ఫేస్‌బుక్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాకుండా డార్క్‌ మోడ్‌, కొత్త లుక్‌ లాంచ్‌ తేదీ వగైరా వివరాలు కూడా ఫేస్‌బుక్‌ చెప్పడం లేదు. అయితే ఫైనల్‌ ప్రోడక్ట్‌ వచ్చేటప్పటికి ఇందులో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. 

దీంతోపాటు కొత్త వెర్షన్‌ను అంత త్వరగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఫేస్‌బుక్‌ సుముఖంగా లేదని తెలుస్తోంది. గతంలో గూగుల్‌ ఇన్‌ బాక్స్‌ వ్యవహరించిన శైలిలోనే ఇన్వైట్‌ బేసిస్‌ను వాడాలనుకుంటోంది. అంటే దీని కోసం రిక్వెస్ట్‌ పెట్టుకున్నవాళ్లకు, లేదా వినియోగిస్తున్న వాళ్లు సూచించినవాళ్లకు తొలుత అవకాశం ఇస్తారట. అక్కడికి కొన్నాళ్లకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కొత్త యూఐ సంగతేమేకానీ... డార్క్‌ మోడ్‌ మాత్రం చాలా బాగుందని ఇప్పటికే దానిని వాడుతున్న బీటా యూజర్లు చెబుతున్నారు.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle