newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ కీలక నిర్ణయం

13-03-202013-03-2020 14:21:30 IST
Updated On 13-03-2020 14:47:02 ISTUpdated On 13-03-20202020-03-13T08:51:30.196Z13-03-2020 2020-03-13T08:51:27.876Z - 2020-03-13T09:17:02.462Z - 13-03-2020

ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ సంస్థలను ఓ సమస్య వెన్నాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల విషయంలో ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ విసిరిన సవాల్ తో  ప్రముఖ మేసేజింగ్‌ యాప్‌ ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విట్టర్‌ ఉద్యోగులు ఇక తమ ఆఫీసులకు రానవసరం లేదని, తదుపరి ఆదేశాలు అందేవరకూ ఇంటి నుంచే విధులు నిర్వహించుకునే సౌలభ్యం కల్పించాయి.

ప్రాణాలు హరిస్తున్న కోవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ హెచ్చార్డీ అధికారులు తెలిపారు. డిసెంబర్‌, 2019లో చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. చైనాలోనే 3500 మంది వరకూ మరణించారు. ఈ వ్యాధి ఇరాన్, ఇటలీలను కుదిపేస్తోంది. ఈ వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 4,600 మంది ప్రాణాలు కోల్పోగా లక్షా 30 వేలకు పైగా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

కోవిడ్‌-19ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంలో వివిధ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న హాంకాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ట్విట్టర్ ఫిబ్రవరి నుంచే ఆదేశాలు ఇచ్చింది. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు. జనసమూహంలోకి రానవసరం లేదు. కాబట్టి వైరస్ వ్యాప్తి అరికట్టబడుతుందని అధికారులు అంటున్నారు. ఇది ఊహించని నిర్ణయమే.. కానీ ప్రస్తుత పరిస్థితులు కూడా ఊహించని విధంగానే ఉన్నాయంటూ ట్విట్టర్ అధికారులు తెలిపారు.

ఇటు గూగుల్ కూడా కీలక ఆదేశాలిచ్చింది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లో ఉన్న తన కార్యాలయాలకు ఉద్యోగులు రానవసరం లేదని గూగుల్‌ ఇదివరకే ప్రకటించింది. ఆపిల్‌ సంస్థ కూడా ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అవకాశం కల్పించింది. ఇక సింగపూర్‌, లండన్‌లలో ఉన్న తన కార్యాలయాలలో సంపూర్ణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఫేస్‌బుక్‌ వాటిని తాత్కాలికంగా మూసేసింది. దీంతో ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడానికి సిద్ధమయ్యారు. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle