newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్విట్టర్లో బీజేపీ దూకుడు.. 11మిలియన్ల ఫాలోవర్లు

12-05-201912-05-2019 09:51:20 IST
Updated On 12-05-2019 09:51:01 ISTUpdated On 12-05-20192019-05-12T04:21:20.236Z12-05-2019 2019-05-12T04:17:25.119Z - 2019-05-12T04:21:01.425Z - 12-05-2019

ట్విట్టర్లో బీజేపీ దూకుడు.. 11మిలియన్ల ఫాలోవర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ శ్రేణులను ముందుకు నడిపించింది సోషల్ మీడియా ప్రచారమే అని చెబుతారు. మళ్ళీ 2019లో అయితే బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. 

సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ట్విటర్‌లో బీజేపీని అనుసరిస్తున్న నెటిజన్ల సంఖ్య 11 మిలియన్లకు చేరింది. అంటే కోటి పది లక్షల మంది బీజేపీని ఫాలో అవుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ పార్టీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవియ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీజేపీని అనుసరిస్తున్న అందరికీ  ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీని ట్విట్టర్‌లో 5.14 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కాగా.. ప్రధాని నరేంద్రమోడీని ట్విట్టర్‌లో 47.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని 9.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మొత్తం మీద ఆయా పార్టీలు సామాజిక మాధ్యమాలను బాగానే ఉపయోగించుకుంటున్నాయి.నేతలు ఎక్కడికి వెళుతున్నారో ముందే ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా తెలియజేయడంతో జనసమీకరణ బాగానే జరుగుతోంది. నేతల ట్వీట్లు కూడా వైరల్ అవుతున్నాయి. 

Image may contain: text

ప్రజలకోసం బీజేపీ ఏం చేస్తుందో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నామని, ఫాలోవర్ల సంఖ్య కోటి దాటడం సంతోషం అన్నారు కర్నాటక బీజేపీ ఓబీసీ సెల్ కన్వీనర్, తెలుగు వ్యక్తి అయిన ఎంవీఎస్ఎన్ రాజు కూనపరాజు. ఆయన ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో ఫోన్లో తన స్పందన తెలిపారు. బీజేపీని ప్రజలకు మరింతగా చేరువ చేయడంలో ట్విట్టర్ పాత్ర కీలకంగా మారిందన్నారు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle