newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్విట్టర్లో దూసుకుపోతున్న ఆర్థికశాఖ . 2 మిలియన్ల ఫాలోవర్లు

14-06-202014-06-2020 12:04:17 IST
2020-06-14T06:34:17.368Z14-06-2020 2020-06-14T06:33:45.758Z - - 11-04-2021

ట్విట్టర్లో దూసుకుపోతున్న ఆర్థికశాఖ . 2 మిలియన్ల ఫాలోవర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు ప్రధాని మోడీ ఆత్మనిర్భర భారత్ పేరుతో ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వలస కార్మికుల సంక్షేమానికి, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారుల కోసం అనేక పథకాలు, రాయితీలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలు స్వీయనిర్బంధం పాటిస్తున్నారు. ఇళ్ళకే పరిమితం అయిన జనం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నారు. 

తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్ అకౌంట్ల ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 20లక్షలమంది కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టన్ హ్యాండిల్ ఉపయోగిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్ల మార్క్ సాధించిందని ట్వీట్ చేశారు ఆర్థిక శాఖ అధికారులు. @FinMinIndia పేరుతో ట్విట్టర్లో ఆర్థిక శాఖకు సోషల్ మీడియా అకౌంట్ వుంది. మొదటిసారి అధికారంలోకి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 జూలైలో ఈ అకౌంట్ ప్రారంభించింది. 

ఇంచుమించు ఆరేళ్ళలో ఫాలోవర్ల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఆర్థికశాఖకు చెందిన అప్ డేట్స్ ఇందులో అందుబాటులో వుంచుతున్నారు. ‘‘2 మిలియన్ల మంది ఫాలోవర్లు మమ్మల్ని అనుసరిస్తున్నారని ప్రకటించడానికి ఎంతో సంతోషంగా ఉంది. మీ అభిమానానికి ధన్యవాదాలు. మమ్మల్ని కనెక్ట్ అయి వుండండి’’ అంటూ ట్వీట్ చేశారు అధికారులు. మోడీ మంత్రివర్గంలోని ఆర్థిక శాఖతో పాటు హోం శాఖ ట్విట్టర్ అకౌంట్ 4.9 మిలియన్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా, డిఫెన్స్ మినిస్ట్రీ ట్విట్టర్ హ్యాండిల్ 0.5 (5లక్షలు) మంది ఫాలోవర్లను కలిగి వుంది. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle