newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్విటర్‌లో ఇక నో ‘పాలిటిక్స్‌’

01-11-201901-11-2019 14:46:41 IST
2019-11-01T09:16:41.847Z01-11-2019 2019-11-01T09:16:39.894Z - - 11-04-2021

ట్విటర్‌లో ఇక నో ‘పాలిటిక్స్‌’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ క్షణాన డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాడో కానీ.... సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌, రాజకీయ ప్రచారం అనే టాపిక్‌ హాట్‌టాపిక్‌ అయ్యింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి సోషల్‌ మీడియాను ట్రంప్‌ తనకు అవరసరమైనట్లు వాడుకున్నాడని వార్తలొచ్చాయి. దీనిపై చాలా రోజుల చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ‘సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం’ అనే కాన్సెప్ట్‌పై పెద్ద చర్చలే పెట్టాయి. ఈ అంశంలో ట్విటర్‌ కూడా ఉంది.

ఇటీవల జరిగిన మన దేశ సార్వత్రిక ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా ప్రభావం గురించి చర్చ సాగింది. సోషల్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలు వద్దంటూ ప్రచారం మొదలైంది. ఇప్పుడు దీనిపై ట్విటర్‌ స్పందించింది. ఇకపై ట్విటర్‌లో ఏ విధమైన రాజకీయ ప్రకటనలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

ట్విటర్‌లో పాలిటిక్స్‌ ప్రచారానికి ఎంట్రీ లేదంటూ ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ ప్రకటించారు. దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యం మనుగడను నిర్దేశించే సందేశాలు సోషల్‌ మీడియాలో అమ్మకానికి అందుబాటులో ఉండటం సరికాదని ట్విటర్‌ అభిప్రాయం. అందుకే ట్విటర్‌లో రాజకీయ ప్రకటనలు రద్దు చేస్తున్నాం. వచ్చే నెల 22 నుంచి ఈ నిషేధం వర్తిస్తుంది.

‘‘ఇంటర్నెట్‌లో ప్రకటనలు చాలా శక్తివంతమైనవి. అవి రాజకీయాలకు గణనీయమైన చేటు చేస్తాయి. సాంకేతికంగా సృష్టించిన ఈ కృత్రిమ సమాచారం ప్రజలకు మేలు చేయదు. సత్యదూరమైన రాజకీయ ప్రకటనలు ప్రజాభిప్రాయానికి కొత్త సమస్యగా పరిణమిస్తాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి ట్విటర్‌ను ఉపయోగించుకోవడాన్ని అంగీకరించం’’ అని డోర్సీ చెప్పారు. అయితే ఓటర్ల నమోదుకు సంబంధించిన ప్రకటనలకు మాత్రం ఈ రద్దు వర్తించదు.

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ట్విటర్‌ ప్రకటన కీలకంగా మారింది. దీంతో అమెరికాలో ట్విటర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఓ వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం ఏర్పడ్డాయి. ట్విటర్‌ చర్య ట్రంప్‌ను, కన్సర్వేటివ్‌ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం అని ట్రంప్‌ ఎన్నికల ప్రచార నిర్వాహకుడు బ్రాడ్‌ పార్స్‌క్లే ఆరోపించారు. ‘‘ధనం, ప్రజాస్వామ్యంలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాల్సి వచ్చినపుడు, ధనాన్ని గెలవనివ్వకపోవడమే ఉత్తమం’’ అని డెమోక్రటిక్‌ పార్టీ అధికార ప్రతినిథి బిల్‌ రూసో అన్నారు. మరోవైపు రాజకీయ ప్రకటనల రద్దు విషయమై వచ్చే నెల 15న ప్రకటిస్తామని ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సీ అన్నారు.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   9 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle