newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్రూకాలర్ వాడుతున్నారా? అయితే మీ డేటా హ్యాక్ అయినట్టే!

24-05-201924-05-2019 16:34:10 IST
Updated On 24-05-2019 16:34:39 ISTUpdated On 24-05-20192019-05-24T11:04:10.855Z24-05-2019 2019-05-24T11:04:08.662Z - 2019-05-24T11:04:39.007Z - 24-05-2019

ట్రూకాలర్ వాడుతున్నారా? అయితే మీ డేటా హ్యాక్ అయినట్టే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎవరైనా మీకు ఫోన్ చేస్తే వాళ్ళెవరో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్లో ట్రూకాలర్ యాప్ ఉంటే చాలు. అయితే ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం రిస్క్ అంటున్నారు సైబర్ నిపుణులు. ట్రూకాలర్‌ యాప్‌‌‌లోని వినియోగదారుల డేటా అమ్మకానికి పెట్టేశారని వార్తలు వస్తున్నాయి. ఇవి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారని ఓ నిపుణుడు హెచ్చరించారు.

డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్ పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది. కేవలం లక్షా యాభైవేలు ఇస్తే చాలు కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌లో దొరుకుతోంది.

ప్రైవేట్‌‌ ఇంటర్నెట్‌‌ ప్లాట్‌‌ఫాంలో ఈ డేటాను అమ్మకానికి పెట్టారని ఓ సైబర్ నిపుణుడు పేర్కొనడం సంచలనంగా మారింది. ఆందోళనకు గురిచేసే అంశం ఏంటంటే అమ్మకానికి పెట్టిన డేటాలో 70 నుంచి 80 శాతం ఇండియన్లదే అని నివేదికలు చెబుతున్నాయి. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లోని లక్షలాది మంది సెలబ్రిటీలు, ముఖ్యమైన వ్యక్తుల వ్యక్తిగత సమాచారం బయటకొచ్చిందని వార్తలొచ్చిన కొద్దిరోజుల్లోనే ట్రూకాలర్‌‌ డేటా వార్త సంచలనం రేపుతోంది. 

ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఇలా మొత్తం డేటా ఎవరైనా పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ వినియోగదారుల సంఖ్య 14 కోట్లకు పైమాటే. డార్క్ వెబ్ లో యూజర్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారం అత్యధికంగా రూ.20 లక్షలకు అమ్మకానికి పెట్టారు. ఇదిలా ఉంటే కోట్లాది మంది యూజర్ల డేటా లీక్ వ్యవహారంపై ట్రూకాలర్ స్పందించింది.

ట్రూకాలర్ యూజర్ల డేటా లీక్‌ కాలేదని ఖండించింది. కొందరు యూజర్లు తమ అకౌంట్లను దుర్వినియోగం చేస్తున్నారని ట్రూకాలర్ వాదిస్తోంది. డేటా లీక్‌కు సంబంధించిన ఆధారాలు లభించలేదని ట్రూకాలర్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. శాంపిల్ డేటా ట్రూకాలర్ డేటాతో మ్యాచ్ కాలేదని వెల్లడించారు. ఏది ఏమైనా ట్రూకాలర్ డేటా లీక్ వార్తలు షాక్‌కి గురిచేస్తున్నాయి. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle