newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్రంప్ బెదిరింపులు.. టిక్ టాక్‌లో బిగ్ వికెట్ గుడ్ బై

27-08-202027-08-2020 13:08:57 IST
Updated On 27-08-2020 16:00:33 ISTUpdated On 27-08-20202020-08-27T07:38:57.016Z27-08-2020 2020-08-27T07:37:30.871Z - 2020-08-27T10:30:33.970Z - 27-08-2020

ట్రంప్ బెదిరింపులు.. టిక్ టాక్‌లో బిగ్ వికెట్ గుడ్ బై
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిక్ టాక్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందా? అంటే అవుననే అనిపిస్తోంది. గాల్వాన్ ఘటన తర్వాత భారత్ లో నిషేధం విధించాక మూలిగేనక్కమీద తాటిపండు పడిన చందంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా బెదిరింపులకు దిగడంతో ఆ సంస్థ దిక్కుతోచక అల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మేర స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అయింది. యూత్ కి ఈ యాప్ అంటే ఎంతో ఇష్టమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధపు కత్తి వేలాడుతోంది. ఏ క్షణమైనా టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలు ప్రస్తుతం అమెరికాలో నెలకొని ఉన్నాయి. 

భారత్ సహా అన్ని దేశాల్లోనూ ఈ వీడియో ప్లాట్‌ఫామింగ్ యాప్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. భారత్ లో నిషేధంతో చైనా ఖంగుతింది. న్యాయపరంగా దీనిపై పోరాడేందుకు సిద్ధమయింది. ఇది చాలదన్నట్టుగా ఆ సంస్థలో కీలక వికెట్ ఒకటి పడిపోయింది. టిక్‌టాక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెవిన్ మాయెర్ తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఇదివరకు డిస్నీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన కెవిన్ తన పదవికి రాజీనామా చేయడం కార్పొరేట్ సెక్టార్‌లో కలకలం రేపుతోంది. సంస్థలోకి వచ్చి మూడు నెలల వ్యవధిలోనే కెవిన్ తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ జరుగుతున్న పరిణామాలే కెవిన్ రాజీనామాకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కెవిన్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన సీఈఓ స్థానాన్ని వెనెస్సా పప్పాస్‌తో భర్తీ చేయనుంది టిక్ టాక్. ఒకట్రెండు రోజుల్లో పప్పాస్.. టిక్‌టాక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరిస్తారని తెలుస్తోంది. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ, శాన్‌డియాగో స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలను అందుకున్న కెవిన్.. ఈ ఏడాది జూన్‌లో టిక్‌టాక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. 

ఇంతలోనే ఆయన తప్పుకున్నారు.ఈ పరిస్థితులే ఆయన రాజీనామాకు కారణమయ్యాయనే అభిప్రాయాలు కార్పొరేట్ సెక్టార్‌లో వినిపిస్తున్నాయి. జాతీయ భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని టిక్‌టాక్‌ వినియోగాన్ని నిషేధించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామంటూ తరచూ అమెరికా ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

నిషేధం విధించాలంటూ ఇదివరకే 25 మంది సెనెటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ సైతం రాశారు.కెవిన్ మాయెర్ రాజీనామా పట్ల టిక్‌టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యీమింగ్ స్పందించారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకోగలమని చెప్పారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఆయన ఓ లేఖ రాశారు. రాజీనామా చేయాలనే తన నిర్ణయాన్ని ఇదివరకే కెవిన్ తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. టిక్ టాక్ ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, జియో లాంటి సంస్థలు పావులు కదుపుతున్నాయి. 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle