newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెలికాం శాఖకి రూ.10వేల కోట్లు చెల్లించిన ఎయిర్ టెల్

17-02-202017-02-2020 17:54:05 IST
2020-02-17T12:24:05.857Z17-02-2020 2020-02-17T12:24:03.694Z - - 20-04-2021

టెలికాం శాఖకి రూ.10వేల కోట్లు చెల్లించిన ఎయిర్ టెల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రీంకోర్టు ఆగ్రహించడంతో భారతి ఎయిర్ టెల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించింది. ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించినట్టు ప్రకటనలో తెలిపింది. ఆడిటింగ్ తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తిచేస్తామని కంపెనీ చెబుతోంది. భారతి ఎయిర్‌టెల్‌, భారతి హెక్సాకామ్‌, టెలినార్‌ల తరపున మొత్తం​ రూ 10,000 కోట్లు చెల్లించింది. 

సుప్రీంకోర్టులో తదుపరి విచారణ గడువు ముగిసేలోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని ఎయిర్ టెల్ పేర్కొంది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్‌టెల్‌ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని పేర్కొంది.

ఇక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా భారతి ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి రూ 35,586 కోట్లు బకాయిపడింది. ఇప్పుడు రూ 10 వేల కోట్లు చెల్లించడంతో మిగిలిన మొత్తం చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. 

ఇటు వొడాఫోన్-ఐడియా మాత్రం బకాయిల చెల్లింపు విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఏజీఆర్‌ చెల్లింపులపై పలుసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వివరణతో మార్చి 17న కోర్టుకు హాజరవ్వాలని వోడాఫోన్, భారతి ఎయిర్ టెల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.  ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏజీఆర్ ఛార్జీలు వసూలు చేస్తే వోడాఫోన్ -ఐడియా మూతపడడం ఖాయం అంటున్నారు. 

ఇది కూడా చదవండి ..ఎయిర్ టెల్, వోడా ఫోన్‌లపై సుప్రీం సీరియస్

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle