టీచర్స్ డే గూగుల్.. ఆక్టోపస్ సందడి
05-09-201905-09-2019 14:35:56 IST
2019-09-05T09:05:56.231Z05-09-2019 2019-09-05T09:05:54.359Z - - 15-04-2021

సెప్టెంబర్ 5. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. తమకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తుచేసుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుని టీచర్స్ డే జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ ప్రపంచంలోని టీచర్లందరికీ హోమ్ పేజీలో డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతి సందర్భాన్ని గుర్తుచేసేలా డూడుల్ రూపొందించి దానిని నెటిజన్లకు అందించడం గూగుల్ కి అలవాటుగా మారింది. తాజాగా ఆక్టోపస్ రూపొందించిన డూడుల్ ద్వారా క్లాస్ రూంలో ఉపాధ్యాయుడు ఏమేం చేస్తారో వివరించే ప్రయత్నం చేసింది. గూగుల్ డూడుల్ లో ఆక్టోపస్ ఉపాధ్యాయుడు అనే అర్థం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ డూడుల్ అందరినీ ఎంతగానో కట్టిపడేస్తోంది.ఈ డూడుల్ పై క్లిక్ చేస్తే ఆ గ్లోబ్ టీచర్లా మారిపోతుంది. స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిజిక్స్, అంతరిక్ష శాస్త్రం ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ఐకాన్స్ అన్నీ చుట్టూ కనిపించేలా డూడుల్ ఏర్పాటు చేశారు. టీచర్స్ డే ఆనవాయితీ 1962లో మొదలైంది. ఈ రోజున విద్యాసంస్థల్లో సంబరాలు చేసుకుంటారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు తమతమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అందుకే ఈ రోజును గూగుల్ తన స్టైల్లో డూడుల్తో సెలబ్రేట్ చేస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా