టిక్ టాక్ వీడియో.. తండ్రి కొడుకుల్ని కలిపేసింది
02-03-202002-03-2020 17:47:18 IST
Updated On 03-03-2020 16:05:13 ISTUpdated On 03-03-20202020-03-02T12:17:18.513Z02-03-2020 2020-03-02T12:17:16.463Z - 2020-03-03T10:35:13.430Z - 03-03-2020

ఒక్క ఐడియా జీవితం మార్చడం ఎంతవరకూ నిజమో తెలీదు కానీ ఒక్క టిక్ టాక్ వీడియో మాత్రం రెండుజీవితాల్లో వెలుగులు నింపింది. ఎక్కడో దూరాన వున్న తండ్రి కొడుకును కలిపింది టిక్ టాక్ వీడియో. ఆరేళ్ళ నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ఓ కుటుంబ పెద్దను టిక్ టాక్ వీడియో కలిపింది. కర్నూలు నంద్యాలలోని హరిజన పేటకు చెందిన అనుపూరి పుల్లయ్య గత ఆరేళ్ల నుంచి జాడలేకుండా పోయాడు. కుటుంబసభ్యులు అన్నీ చోట్ల గాలించారు. అయినా అతని జాడ తెలీలేదు. చివరకు చనిపోయి ఉంటాడనుకుని కర్మ కాండలు కూడా చేసేశారు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని టిక్ టాక్ వీడియోలు చేయడం ఈమధ్యకాలంలో అలవాటై పోయింది. ఈ అలవాటే కుటుంబానికి సాయం చేసింది. ఇదే టిక్ టాక్ ఒక కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి కలుసుకోవడానికి వారధి అయింది. తండ్రి కోసం కుమారుడు ఒక టిక్ టాక్ పోస్ట్ పెట్టాడు. "ఒకప్పుడు నేను సంపాదించలేని టైంలో నా డాడీ ముందు ఉన్నాడు..సార్..నేను సంపాదించే టైమ్ వచ్చే సరికి డాడీ ముందు లేడు’’..అని తన తండ్రి ఫోటోతో టిక్ టాక్ చేసి పోస్ట్ చేశాడు. ఈ టిక్ టాక్ ఆనోట ఈనోట తండ్రికి చేరింది. టిక్ టాక్ వీడియో చక్కర్లు కొట్టుకుంటూ తండ్రి దగ్గరకు చేరింది.. వెంటనే తండ్రి కుటుంబ సభ్యులకు తన సమాచారం అందించారు. తండ్రి ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. తండ్రి గుజరాత్ లో ఉన్నాడని తెలుసుకున్న ఇద్దరు కుమారులు గుజరాత్ వెళ్లి తండ్రిని కలుసుకున్నారు. ఏది ఏమైనా తండ్రి కొడుకులను కలిపిన టిక్ టాక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా