newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టిక్ టాక్ వీడియో ఎఫెక్ట్... ఉద్యోగం ఫట్

25-07-201925-07-2019 15:22:36 IST
2019-07-25T09:52:36.330Z25-07-2019 2019-07-25T09:52:30.654Z - - 23-04-2021

టిక్ టాక్ వీడియో ఎఫెక్ట్...  ఉద్యోగం ఫట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ యాప్ యువతను, ఉద్యోగులను ఊపు ఊపుతోంది. టిక్ టాక్ పై కొంతకాలం పాటు నిషేధం విధించింది కోర్టు. మళ్ళీ నిషేధం ఎత్తివేయడంతో టిక్ టాక్ యాప్ ఇంకా ఫేమస్ అయిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్‌కు బానిసలవుతున్నారు.

తమ టాలెంట్‌ను చూపించాలనుకుంటోన్న కొంతమంది మేకప్‌లు వేసుకొని మరీ అందులో వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాదు.. అనేక అనర్థాలను కూడా తీసుకొస్తోంది. 

టిక్ టాక్ యాప్ వల్ల జరుగుతున్న ఘోరాలు అన్నీ ఇన్నీకావు. ఇటీవల తెలంగాణలో యువకుడు ఈ యాప్ కు బలయ్యాడు. మరికొందరు తమ ఉద్యోగాలనే కోల్పోతున్నారు. తాజాగా టిక్‌టాక్ వీడియో చేసి తన ఉద్యోగాన్ని కోల్పోయింది ఓ మహిళా పోలీస్. గుజరాత్‌కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీస్.. మెహ్సానా జిల్లాలోని లంగన్ స్టేషన్‌లో పనిచేస్తోంది.

वर्दी पहनकर महिला पुलिसकर्मी को TIK TOK वीडियो बनाना पड़ा भारी, होगी कार्रवाई

  ఓ పాటకు ఆమె టిక్‌టాక్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆమెపై వేటు పడింది. ఆమెపై  డీఎస్పీ మంజితా వంజరా మాట్లాడుతూ.. ‘‘అర్పితా రూల్స్‌ను బ్రేక్ చేసింది. డ్యూటీలో ఉండి కూడా ఆమె యూనిఫాం వేసుకోలేదు. అంతేకాకుండా స్టేషన్‌లో ఆమె వీడియోను తీసుకుంది. పోలీసులు కచ్చితంగా క్రమశిక్షణను పాటించాలి. అర్పితాకు క్రమశిక్షణ లేదు అందుకే సస్పెండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

టిక్ టాక్ చేస్తూ ఉద్యోగాలలో సస్పెన్షన్‌కు గురికావడం ఇది తొలిసారేం కాదు. ఇంతకుముందే ఖమ్మం కార్పోరేషన్లో ఉద్యోగులు విధుల్లో ఉండి టిక్ టాక్ వీడియోలు చేసి సస్పెన్షన్‌కు గురయిన సంగతి తెలిసిందే.

టిక్ టాక్ పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో తిక్క పనులు చేసి దాని ఫలితం అనుభవించారు. ఉద్యోగుల టిక్ టాక్ తిక్క కుదర్చారు ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు. టిక్ టాక్ చేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి సెక్షన్లు, డిపార్టుమెంట్లు మార్చారు. సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు వారి సెక్షన్లను మార్చారు. వారందరినీ శానిటేషన్ విభాగానికి బదిలీ చేశారు. సో, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో టిక్ టాక్ ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. 

ఖమ్మం కార్పోరేషన్‌ లో హల్ చల్ చేసిన అధికారుల టిక్ టాక్ వీడియోలు

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle