newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టిక్ టాక్.. వరల్డ్‌లో మనమే నెంబర్ వన్

03-02-202003-02-2020 13:57:14 IST
2020-02-03T08:27:14.419Z03-02-2020 2020-02-03T08:27:08.065Z - - 15-04-2021

టిక్ టాక్.. వరల్డ్‌లో మనమే నెంబర్ వన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియాలో అతి తక్కువకాలంలో బాగా పాపులర్ అయినా యాప్ టిక్ టాక్. ఈ యాప్ వినియోగం‌లో భారత్ నెంబర్ వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఇండియాలో బాగా పాపులర్ అయినా టిక్ టాక్ వినియోగం‌లో భారత్ నెంబర్1 గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 31 శాతం డౌన్ లోడ్లు భారత్ లో జరిగాయి. దాదాపుగా 614 మిలియన్ డౌన్ లోడ్లు జరిగాయంటే టిక్ టాక్ పిచ్చి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 2018లో కంటే ఆరుశాతం ఇవి పెరిగాయి. 

నాన్ గేమింగ్ కేటగిరీలో వాట్సాప్ 707.40 మిలియన్ ఇన్ స్టాల్స్ తో మొదటి స్థానంలో వుంది.  636.20 మిలియన్ డౌన్ లోడ్లతో ఫేస్ బుక్ మెసెంజర్ రెండవ స్థానం సంపాదించింది. గత ఏడాది భద్రతా కారణాల రీత్యా టిక్ టాక్ యాప్ కొంతకాలం నిషేధానికి గురైంది. అనంతరం నిర్వాహకులు కోర్టుని ఆశ్రయించి పునరుద్దరించుకున్నారు. టిక్ టాక్ వీడియోలతో కొందరు ప్రాచుర్యం పొందారు. అయితే టిక్ టాక్ కారణంగా హత్యలు, దంపతుల మధ్య భేదాభిప్రాయలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

మరోవైపు టిక్ టాక్ పై భారతీయులు గడిపింది 5.5 బిలియన్ గంటలని నివేదిక తెలిపింది. ప్రతినెలా టిక్ టాక్ యాక్టివ్ యూజర్ల సంఖ్య 90 శాతం పెరుగుతోంది. డిసెంబరులో 81 మిలియన్ల మంది యూజర్లు వున్నారు. చైనా తర్వాత రెండవస్థానం భారత్ దే కావడం విశేషం. ఫేస్ బుక్ 15 శాతం పెరుగుదల నమోదుచేసుకుంది. నెలవారి వినియోగదారులు ఫేస్ బుక్ 224 మిలియన్లు కాగా, 137 మిలియన్ల మంది కొత్తగా వచ్చి చేరారు. ఫేస్ బుక్ కంటే ఇన్ స్టా గ్రామ్ పెరుగుదల 40 శాతం పెరిగింది. 25.5 బిలియన్ల గంటల పాటు ఫేస్ బుక్ పై నెటిజన్లు గడిపారు. 

11 దేశాల సగటు కంటే భారత దేశంలోనే టిక్ టాక్ వినియోగదారులు పెరిగినట్టు యాప్ అన్నె సర్వే తెలియచేసింది. భారతీయులు టిక్ టాక్ కి బానిసలుగా మారుతున్నారనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. వాట్సప్ తర్వాత గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్లలో రెండవ స్థానంలో ఉంది. అయితే, 2020లో టిక్ టాక్ ఎలాంటి వృద్ధిని నమోదుచేసుకుంటుందో చూడాలి. ఎందుకంటే, టిక్ టాక్ పై వివిధ దేశాలు సెన్సార్, మోనిటరింగ్ చేస్తున్నాయి. యుఎస్ ఆర్మీ టిక్ టాక్ వినియోగంపై ఆంక్షలు విధించింది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle