newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

టిక్ టాక్ ప్రొ పేరుతో సైబర్ నేరగాళ్ళ వల.. తస్మాత్ జాగ్రత్త!

06-07-202006-07-2020 19:01:54 IST
2020-07-06T13:31:54.885Z06-07-2020 2020-07-06T13:31:43.406Z - - 04-08-2020

టిక్ టాక్ ప్రొ పేరుతో సైబర్ నేరగాళ్ళ వల.. తస్మాత్ జాగ్రత్త!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో యువతను బాగా ప్రభావితం చేసింది టిక్ టాక్ యాప్. తాజాగా చైనాతో ఏర్పడిన సరిహద్దు గొడవల నేపథ్యంలో 59 యాప్ ల పై నిషేధం విధించింది. వీటిని ప్లే స్టోర్, ఆప్ స్టోర్ల నుంచి కూడా తొలగించారు. అయితే సైబర్ నేరగాళ్లు మాత్రం యువత బలహీనతలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు యువతలో ఆ యాప్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరతీశారు. టిక్‌టాక్‌ పేరిట మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతూ  యూజర్లను మోసం చేస్తున్నారు. 

‘మరోసారి టిక్‌టాక్‌ వీడియోలను ఎంజాయ్‌ చేయండి.. క్రియేటివ్‌ వీడియోలను రూపొందించండి. ఇప్పుడు టిక్‌టాక్‌.. టిక్‌టాక్‌ ప్రో గా అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్‌ చేయడం కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి’ అని రాసి ఉంటుంది. దీనిని పొరబాటున క్లిక్ చేస్తే అంతే సంగతులు. ఈ లింక్‌ క్లిక్‌ చేసినవారికి సదరు యాప్‌ ఐకాన్‌ అచ్చం టిక్‌టాక్‌ మాదిరిగానే కనిపిస్తుంది.  డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే అది కెమెరా, మైక్‌ లాంటి ఇతర అనుమతులు అడుగుతుంది. ఆ తర్వాత ఆ యాప్‌ పనిచేయదు. దీనిని డౌన్ లోడ్ చేస్తే మీ ఫోన్‌లోని డేటా చోరికి గురయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా ఫోన్లలో ఉన్న ఇతర సోషల్‌ మీడియా యాప్‌ల లాగిన్‌ సమాచారం చోరికి గురవుతుందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మెసేజ్ లు అసలు క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. మీరు క్లిక్ చేస్తే మాత్రం మీ వ్యక్తిగత సమాచారం వారి చేతుల్లోకి వెళుతుంది. మీ బ్యాంకు లోని బ్యాలెన్స్ అన్నీ హుష్ కాకి అవుతాయి. కాబట్టి టిక్ టాక్ పేరుతో కనిపించే ఏ లింక్ కి అయినా దూరంగా ఉండండి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle