టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్ చట్ పట్కు గిరాకీ
04-07-202004-07-2020 13:21:12 IST
Updated On 04-07-2020 14:03:46 ISTUpdated On 04-07-20202020-07-04T07:51:12.281Z04-07-2020 2020-07-04T07:51:01.320Z - 2020-07-04T08:33:46.581Z - 04-07-2020

చైనా-భారత్ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన 59 యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ యాప్స్ కు సంబంధించి గూగుల్ ఈమధ్యే కీలక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ లోనే ఉంచామని... అయితే ఇండియాలో అందుబాటులో లేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశామని తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్స్ డెవలపర్లకు అందించామని తెలిపింది. దీంతో టిక్ టాక్ అందుబాటులో లేకుండా పోయింది. టిక్ టాక్ పై నిషేధంతో దేశీయ యాప్ లకు ఆదరణ పెరుగుతోంది. చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు టిక్ టాక్ కి బానిసలుగా మారిపోయారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు వీడియోలను తీసి పోస్ట్ చేసి వచ్చిన లైక్ లను చూసుకుంటూ మురిసిపోయారు. కేంద్రం నిషేధించిన యాప్ లలో టిక్ టాక్ యాప్ కూడా ఉండడంతో చాలా మంది టిక్ టాక్ ఫాలోవర్స్ కి షాక్ తగిలినంత పనైంది. ఇక తమ టాలెంట్ ని ప్రజలకు ఏ విధంగా చూపించాలి అని బాధపడుతున్న వేళ తెలంగాణకు చెందిన ఓ యువకుడు అచ్చం టిక్ టాక్ లాంటి ఓ యాప్ ను రూపొందించాడు. ఈయాప్ కు 'చట్పట్' అనే పేరును కూడా పెట్టాడు. టిక్ టాక్ యాప్ ను ఏ విధంగానైతే ఉపయోగిస్తారో అచ్చం అదే విధంగా ఈ ఛట్ పట్ యాప్ ఉపయోగించవచ్చంటున్నాడు. ఈ చట్పట్ యాప్ కు ప్లేస్టోర్లో డిమాండ్ బాగా పెరిగింది. టిక్ టాక్ ఆగిపోవడంతో చట్ పట్ యాప్ ప్లేస్టోర్ ట్రెండింగ్ సోషల్ క్యాటగిరీలో టాప్ లో వుంది. .ఈ యాప్ జూన్ 29న ప్లేస్టోర్ లోకి వచ్చింది. ఆరురోజుల్లోనే వేలాదిమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ చట్ పట్ యాప్ కు యూజర్లు మంచి రేటింగ్ ఇస్తున్నారు. చట్ పట్ మేడిన్ ఇండియా పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా