టిక్ టాక్ ట్విట్టర్ పరం కానుందా?
10-08-202010-08-2020 18:04:39 IST
Updated On 10-08-2020 18:38:53 ISTUpdated On 10-08-20202020-08-10T12:34:39.832Z10-08-2020 2020-08-10T12:34:32.135Z - 2020-08-10T13:08:53.675Z - 10-08-2020

ప్రముఖ సోషల్ మీడియా షేరింగ్ యాప్ టిక్ టాక్ కథ ముగిసిపోతోందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూఎస్‌లో బ్యాన్ చేసిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను ట్విట్టర్ కొనుగోలు చేయాలని చూస్తోందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌తో పాటు ట్విట్టర్ కూడా టిక్‌టాక్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ట్విట్టర్లో టిక్‌టాక్‌ను విలీనం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. టిక్‌టాక్ యూఎస్ ఆపరేషన్స్ ను కూడా కలుపుకుని ట్విట్టర్ ఈ డీల్‌ను కొనసాగిస్తుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ట్విట్టర్ టిక్ టాక్ పై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడుతుందా? అమెరికాలో యూఎస్ ఆపరేషన్స్‌ను కూడా ఈ డీల్‌లో ట్విట్టర్ కలుపుకుంటే.. మైక్రోసాఫ్ట్ లేదా ఇతర బిడ్డర్ల మాదిరి యాంటీ ట్రస్ట్ స్క్రూటినీని ఆ కంపెనీ ఎదుర్కోలేదంటున్నారు. టిక్‌టాక్ ఓనర్ బైట్‌డ్యాన్స్‌తో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులు విపరీతంగా చర్చలు జరుపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ డీల్‌లో ప్రధాన పోటీదారుగా వుంది. టిక్‌టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో కూడా చర్చించారు. టిక్‌టాక్‌ను ట్విట్టర్ కొనుగోలు చేస్తుందని వస్తోన్న మార్కెట్ రూమర్లపై తాము కామెంట్ చేయమని టిక్‌టాక్ అధికార ప్రతినిధి అన్నారు. ట్విట్టర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29 బిలియన్ డాలర్లుగా ఉంది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 1.6 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. ఒకవేళ టిక్‌టాక్‌ను ట్విట్టర్ కొనాలనుకుంటే, ఇతర ఇన్వెస్టర్ల సాయం కూడా తీసుకోవాల్సిందే. దీంతో ట్విట్టర్ కొనుగోలు చేస్తుందా లేదా త్వరలో తేలిపోనుంది.

వాట్సప్ కు భారత్ వార్నింగ్
17 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా