newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టిక్ టాక్ కొనుగోలుపై వాల్ మార్ట్ క్లారిటీ... ఆసక్తి లేదన్న గూగుల్

28-08-202028-08-2020 10:07:31 IST
Updated On 28-08-2020 10:36:58 ISTUpdated On 28-08-20202020-08-28T04:37:31.846Z28-08-2020 2020-08-28T04:34:54.092Z - 2020-08-28T05:06:58.306Z - 28-08-2020

టిక్ టాక్ కొనుగోలుపై వాల్ మార్ట్ క్లారిటీ... ఆసక్తి లేదన్న గూగుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిక్ టాక్ యాప్ నిషేధం తర్వాత ఆ యాప్ కొనుగోలుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయన్న వార్తలు వినిపించాయి. అమెరికాలోని టిక్ టాక్ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసక్తిని చూపిస్తుండగా, తాజాగా వాల్ మార్ట్ కూడా తెరమీదకు వచ్చింది. టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన గంటల అనంతరం వాల్ మార్ట్ ఐఎన్సీ ఓ ప్రకటన చేస్తూ, మైక్రోసాఫ్ట్ తో తాము డీల్ కుదుర్చుకుని టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు పోటీలో ఉన్నామని స్పష్టం చేసింది.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో పాటు ఒరాకిల్ గ్రూప్, రిలయెన్స్ జియో సైతం టిక్ టాక్ యూఎస్ ఆస్తుల కోసం పోటీలో ఉంది. దీనికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కెవిన్ రాజీనామా, ఆ వెంటనే వాల్ మార్ట్ పోటీలోకి దిగింది. దీంతో పోటీ తీవ్రంగా వున్నట్టు అర్థం అవుతోంది.  ట్రంప్ సర్కారు టిక్ టాక్ యాజమాన్య సంస్థ, చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తూ, అమెరికా కార్యకలాపాలు విక్రయించాల్సిందేనని ఖరాఖండీగా చెప్పాయి,

అలా జరగని పక్షంలో మాతృసంస్థతో ఒక్క ఆర్థిక లావాదేవీకి కూడా అనుమతించబోమని ట్రంప్ స్వయంగా ఇటీవల హెచ్చరించారు. మైక్రోసాఫ్ట్ తో కలిసి తాము టిక్ టాక్ ను సొంతం చేసుకుంటే, అమెరికన్ల అంచనాలను అందుకునేలా దాన్ని అభివృద్ధి చేయగలమన్న నమ్మకం ఉందన్నారు. యూఎస్ నియంత్రణా సంస్థల నిబంధనలకు అనుగుణంగా సంస్థను నడిపిస్తామన్నారు. కస్టమర్ల డేటాకు భద్రత వుంటుందన్నారు.

మరోవైపు టిక్ టాక్ కొనుగోలుకు తాము ఆసక్తి చూపడం లేదని క్లారిటీ ఇచ్చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. చైనా వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తోందని వస్తున్న వార్తలను సుందర్‌ పిచాయ్‌ త్రోసిపుచ్చారు. . ఈ యాప్‌ తమ క్లౌడ్‌ సర్వీసెస్‌ సేవలను ఉపయోగించుకుంటోందని, అందుకు రుసుము చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసే ఆలోచనలో గూగుల్‌ లేదని పిచాయ్‌ వెల్లడించారు. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ గ్రూప్‌ బిడ్‌లో చేరుదామని తొలుత భావించినా.. అనంతరం విరమించుకున్నట్టు చెప్పారు.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle